»   » శ్రీను వైట్ల 'డీ' తమిళ రీమేక్ డిటేల్స్...

శ్రీను వైట్ల 'డీ' తమిళ రీమేక్ డిటేల్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీను వైట్ల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'డీ'. మంచు విష్ణు,జెనీలియా కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంలో శ్రీహరి ప్రధాన పాత్రను పోషించారు. ఇప్పుడీ చిత్రం తమిళంలో రీమేక్ అవుతోంది. మెజిస్టిక్‌ మల్టీ మీడియా పతాకంపై వినరు, షర్మిలా జంటగా ప్రభు, సంతానం, గంజాకరుప్పు, ప్రదీప్‌ రావత్‌ తెరకెక్కిస్తున్నారు. తమిళ టైటిల్ ..' మీరట్టల్‌'. ఈ చిత్రాన్ని దర్శకుడు మాదేష్ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాధేష్‌ మాట్లాడుతూ... ఎవరూ ఊహించని ట్విస్టు లతో కథనం వేగంగా సాగుతుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించి విశాలమైన స్థలంలో ఓ ఇంటి కోసం పలుచోట్ల వెతికామన్నారు. చివరకు హైదరాబాదులో నిజాంలకు సంబంధించి ప్రాంతాన్ని చూసి వారి అనుమతితో అక్కడ షూటింగ్‌ చేస్తున్నామన్నారు. అలాగే పాటలను లండన్‌లో చిత్రీకరించారని, చిత్రంలో వచ్చే ఒక ఇంటికి సంబంధించిన సన్నివేశాలను చెన్నరులోని శివాజి గణేషన్‌ ఇంట్లో షూటింగ్‌ చేయడం మరచిపోలేని విషయమన్నారు.

ఈ చిత్రంలో ప్రేమ, సెంటిమెంటు, కామెడి, యాక్షన్‌, హస్యం అన్నీ కలబోసిన చిత్రమన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌మణి అద్బుత సంగీతాన్ని అందించారన్నారు. మే చివరి వారంలో లేదా జూన్‌ మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడం జరుగుందన్నారు. ఇక ఇప్పటికే తెలుగు చిత్రాలు ఇతర భాషల్లోకి రీమేక్ కు వెళ్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిజం పూర్తిగా లేదని అక్కడ హీరోలు విజయ్,అజిత్ వంటి వారు రీమేక్ లో చేయటానికి నిరాకరించారు. అందుకే వినరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

హిందీలోనూ ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకోవటం జరిగింది. అప్పట్లో అమితాబ్,అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతుందని వార్తలు వచ్చాయి. రచయిత కోనవెంకట్ సైతం వాటిని ఖరారు చేసారు. సంజయ్ దత్..శ్రీహరి పాత్రకు చాలా ఇంప్రెస్ అయి చేయటానికి ముందుకు వచ్చాడని అన్నారు. ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తారన్న ఆ చిత్రం ఇంకా కార్యరూపం దాల్చలేదు.

English summary
Mirattal is an upcoming romantic film directed by R. Madhesh starring Vinay Rai and Sharmila Mandre in the lead roles. The film is likely to release in 2012 and is a remake of the successful Telugu film, Dhee.
Please Wait while comments are loading...