»   » ‘డ్రగ్స్‌’తో టాలీవుడ్ పరువు గంగలో కలిసింది.. శ్రీయారెడ్డి ఆవేదన

‘డ్రగ్స్‌’తో టాలీవుడ్ పరువు గంగలో కలిసింది.. శ్రీయారెడ్డి ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌నే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమను కూడా కుదిపేస్తున్నది. ఈ కేసులో ఆరోపణలు వస్తున్న వారందరూ సుపరిచితులు కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి శ్రీయారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. డ్రగ్ కేసు టాలీవుడ్‌పై పరువుపోయింది అని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.

విశాల్ సోదరుడిని పెళ్లి చేసుకొని..

విశాల్ సోదరుడిని పెళ్లి చేసుకొని..

శ్రీయారెడ్డి అమ్మ చెప్పింది, పొగరు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు. గుణ్ణం గంగారాజు తీసిన అమ్మ చెప్పింది చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా నటించారు. కెరీర్ పీక్‌లో ఉండగానే నటుడు విశాల్ సోదరుడిని వివాహం చేసుకొని పరిశ్రమకు దూరమయ్యారు.

తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై

తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై

తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా అండవ కానోమ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఈ చిత్రం సెన్సేషనల్‌గా మారింది. ఈ చిత్రానికి అవార్డులతోపాటు కలెక్షన్ల రివార్డులు కూడా వచ్చే అవకాశముందనే మాట వినిపిస్తున్నది.

 డ్రగ్ మాఫియాలో చిక్కుకోవడం

డ్రగ్ మాఫియాలో చిక్కుకోవడం

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న శ్రీయారెడ్డి చెన్నైలోని అడయార్‌లో కొత్తగా ప్రారంభించిన లిటిల్‌ ఫ్యాక్టరీ అనే పిల్లల బొమ్మల దుకాణం ప్రారంభోత్సవంలో శ్రియారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ మాఫియాలో చిక్కుకోవడం దురదృష్టకరం. డ్రగ్స్‌ వ్యవహారంతో తెలుగు పరిశ్రమ పరువు పోయింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగులో మళ్లీ నటిస్తాను..

తెలుగులో మళ్లీ నటిస్తాను..

అండావ కానోమ్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని శ్రీయారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె పలువురు అనాథ పిల్లలకు ఉచితంగా బొమ్మలు అందజేసి కొద్దిసేపు వారితో గడిపారు.

ఆగస్టు 11న విడుదల

ఆగస్టు 11న విడుదల

అండావ కానోమ్‌ సినిమాకు జే సతీష్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లియోవిజన్ సంస్థ రాజ్‌కుమార్, జేఎస్‌కే.ఫిలిం కార్పొరేషన్ సతీష్‌కుమార్‌ కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
వేల్‌మది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అశ్వమిత్ర సంగీతాన్ని అందించారు. తన అంచనాలు కరెక్ట్‌గా అయితే అండవ కానోమ్‌ చిత్రం ఈ ఏడాది జాతీయ అవార్డుల పట్టికలో చోటు సంపాదించుకుంటుందని నిర్మాత జే సతీష్ కుమార్ అన్నారు. అంతేకాదు ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
After an nine-year hiatus, Shreya Reddy is all set to make her comeback with Andava Kaanom. Sriya was busy with the production of films when she stayed away from acting, and she admits it was something which she didn't enjoy doing. Sriya unhappy over the way tollywood facing drug allegations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu