ఐదుగురం ఉన్నాం.. పడకగదిలోకి వస్తావా? నిర్మాతను చెప్పుతో కొడుతానన్న హీరోయిన్

By Rajababu

Recommended Video

‘సెక్సిజమ్‌’.. నిర్మాతలను చెప్పుతో కొడతానన్న హీరోయిన్ శృతి !

హాలీవుడ్ దర్శకుడు హార్వే విన్‌స్టెయిన్‌ లైంగిక వేధింపుల విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరుగా హీరోయిన్లు పెదవి విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు లైంగిక వేధింపుల అంశాన్ని ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ శ‌‌ృతి హారిహరన్ భయంకరమైన వాస్తవాన్ని వెల్లడించింది.

 పడకగదిని పంచుకొంటే ఆఫర్

పడకగదిని పంచుకొంటే ఆఫర్

ఇండియా టుడే కాంక్లేవ్‌లో సెక్సీజం ఇన్ సినిమా అనే అంశంపై శృతిహారిహరన్ మాట్లాడుతూ.. ఓ తమిళ సినీ నిర్మాత అసభ్యకరమైన వ్యవహారాన్ని మీడియా ముందు పంచుకొన్నారు. సినిమా అవకాశం ఇస్తాం. కానీ నాతో పాటు మరో నలుగురితో పడకగదిని పంచుకోవాలి అన్నారు అని తెలిపారు.

 తమిళ నిర్మాత ఆఫర్

తమిళ నిర్మాత ఆఫర్

ఇండియా టుడే కాంక్లేవ్‌ చర్చావేదికలో ఆ నాటి భయంకరమైన అనుభావాన్ని గుర్తు చేసుకొంటూ.. నేను ఓ కన్నడ సినిమాలో నటించాను. అయితే ఓ తమిళ నిర్మాత ఆ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. తమిళ రీమేక్‌లో నటించాలని తనను సదరు నిర్మాత కోరారు.

నిన్ను వాడుకొంటాం

నిన్ను వాడుకొంటాం

అయితే ఆ సమయంలో నిర్మాత ఏమన్నారంటే.. ఈ సినిమాకు మేము ఐదుగురం నిర్మాతలం. ఈ సినిమాలో నీకు అవకాశం ఇచ్చినందుకు మేము నిన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకొంటాం. అలా అయితేనే మేము నీకు ఆఫర్ ఇస్తాం అని ఆ నిర్మాత చెప్పారు.

చెప్పుతో కొడుతాను

చెప్పుతో కొడుతాను

అందుకు నేను సమాధానం ఇస్తూ.. నేను స్లిప్పర్ కూడా పట్టుకొస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా పట్టించుకోవద్దు అని అన్నాను. దాంతో వారు ఆ సినిమా నుంచి తప్పించారు అని శృతి హరిహరన్ చెప్పారు.

 అవకాశాలు చేజారాయి

అవకాశాలు చేజారాయి

ఆ సంఘటన తర్వాత నిర్మాతల ఒత్తిడితో చాలా సినిమాలు నా వద్దకు వచ్చినట్టే వచ్చి చేజారాయి. ఆమెతో సినిమా చేయడం చాలా ప్రమాదకరం అని నాపై నిర్మాతలు తప్పుడు ప్రచారం చేశారని శృతి హరిహరన్ వెల్లడించారు.

 18 ఏళ్ల వయసులోనే వేధింపులు

18 ఏళ్ల వయసులోనే వేధింపులు

నా సినిమా కెరీర్‌లో అలాంటి సంఘటన మొదటిది కాదు. నా 18వ ఏటనే ఇలాంటి దారుణమైన ఘటనను చవిచూశాను. కన్నడ సినిమా షూటింగ్ సెట్లో నాతో దారుణంగా ప్రవర్తించారు. నేను అడ్డు చెప్పడంతో పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో ఆమెకు తెలియదు. ఇక వదిలేద్దాం అని నిర్మాతలు తప్పించుకొన్నారు అని శృతి హరిహారన్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X