»   » శృతిహాసన్‌ కేసు...జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ

శృతిహాసన్‌ కేసు...జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శక,నిర్మాతలను ఛీటింగ్ చేసిన ఘటనపై నటి శృతిహాసన్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసుని జూబ్లిహిల్స్ స్టేషన్ కు బదిలీ చేసారు. సినిమా ఎగ్రిమెంట్, కాల్షీట్స్ , డేట్స్, అడ్వాన్స్ చెల్పింపు ఇవన్నీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది కాబట్టి... అక్కడికి బదిలీచేయటం జరిగిందని చెప్తున్నారు.

ఈ కేసు ఫైల్ ను అందుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా శృతిహాసన్ కు నోటీసులు జారీ చేయాలని చూస్తున్నారు. ఈ రోజో,రేపో ఆమెకు నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందిగా సూచించనున్నారు. ఆమె నుంచి కేసుకు సంభందించిన వాంగ్మూలం తీసుకోవటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక తెలుగు,తమిళ భాషల్లో రాణిస్తున్న శృతిహాసన్ కెరీర్ కు అర్దాంతరంగా బ్రేకులు పడ్డాయి. ఆమె ఏ కొత్త సినిమా ఒప్పుకోకూడదని, క్రిమినల్ ఇన్విస్టిగేషన్ చెయ్యమని చెన్నై కోర్టు ఆర్డర్ వేసింది. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ (హైదరబాద్,చెన్నై) వారు ఈమెపై సివిల్ మరియు, క్రిమినల్ ప్రొసీడిగ్స్ జరపమని కోరారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Sruthi Hassan's case transfer to Jublie Hills Police station

తమ సంస్థ నిర్మించే సినిమా విషయంలో ముందస్తు ఒప్పందాన్ని కథానాయిక శృతిహాసన్ ఉల్లంఘించిందని చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పిక్చర్‌హౌస్ మీడియా లిమిటెడ్ ఆమెపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొత్త సినిమాలకు శృతిహాసన్ సంతకం చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్‌నిచ్చింది.

ఈ కేసును విచారించి చర్యలు చేపట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసుకు దారితీసిన పరిస్థితుల్ని తెలియజేస్తూ పిక్చర్‌హౌస్ మీడియా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..నాగార్జున, తమిళ నటుడు కార్తి కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటించడానికి శృతిహాసన్ అంగీకరించింది. అందుకుగాను పిక్చర్‌హౌస్ మీడియా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్‌లో శృతిహాసన్ ఇప్పటివరకు పాల్గొనలేదు. ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ కారణంగా డేట్స్‌ను సర్దుబాటు చేసుకోలేకపోతున్నానని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నానని శృతిహాసన్ ఈ మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమా విషయంలో ఆమెతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన తర్వాతే, ఆమెకు అనుకూలమైన డేట్స్‌ను తీసుకోవడం జరిగింది.

అర్థాంతరంగా ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో మా సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లింది. శృతిహాసన్ వృత్తి వ్యతిరేక బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల మా సంస్థ పేరుప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం కూడా వుంది. దాంతో పాటు ఇతర ఆర్టిస్టుల సమయం కూడా వృధా అవుతుంది. ఇలాంటి వృత్తిధర్మ వ్యతిరేక చర్యలు పునరావృతం కాకూడదని శృతిహాసన్‌పై కేసు వేశాం అని పిక్చర్‌హౌస్ మీడియా సంస్థ పేర్కొంది.

English summary
Actor Shruthi Haasan found herself in trouble when an interim injunction order was issued by a City Court restraining her from signing any offer till she completes the multi-starrer being directed by Vamsi Paidipalli that also stars Nagarjuna ,Akkineni and Karthi (brother of actor Surya).
Please Wait while comments are loading...