»   » గౌతమ్‌ కార్తిక్‌ డాన్స్ కు శ్రుతిహాసన్ పాట

గౌతమ్‌ కార్తిక్‌ డాన్స్ కు శ్రుతిహాసన్ పాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రవిప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న తాజా చిత్రంలో గౌతమ్‌ కార్తిక్‌ హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో విజయవంతమైన 'అలా మొదలైంది'కి రీమేక్ ఇది. ఇంకా పేరు ఖరారు చేయలేదు. రాహుల్‌ప్రీతిసింగ్‌, నికిషా పటేల్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రేమ నేపథ్యంలో సాగే కథకు ఇమాన్‌ సంగీతం సమకూర్చుతున్నాడు. గౌతమ్ కార్తీక్ తెలుగులో ..మణిరత్నం కడలి ద్వారా పరిచయమయ్యారు.

ఇటీవలే ఓ పాటను అనిరుధ్‌ ఆలపించాడు. 'షటప్‌ యువర్‌ మౌత్‌' అంటూ సాగే గీతాన్ని ఇటీవల రికార్డ్‌ చేశారు. మదన్‌కార్కి రాసిన ఈ పాటను నటి శ్రుతిహాసన్‌ అరేబియన్‌ శైలిలో పాడిందట. ప్రియదర్శన్‌ సహాయకుడు రవి త్యాగరాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రవికుమార్‌, బీవీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Sruthi Hassan sang for Gowtham Karthik Film

శ్రుతి హాసన్ మాట్లాడుతూ.... ' అదో ఫన్ సాంగ్ ...నేను చాలా ఇష్టపడి పాడాను... ఇక విజయం సాధిస్తే విర్రవీగడం, పరాజయం ఎదురైతే పారిపోవడం ఇలా ఉండటం నాకు ఇష్టం ఉండదు' అంటోంది శ్రుతి హాసన్‌. తన దృష్టిలో రెండూ సమానమేనట. 'విజయాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు! కష్టపడినదానికి ఫలితం వచ్చింది అనుకుంటారు. కరక్టే, కానీ ఆ విజయం తరువాత మరింత కష్టపడాల్సిన బాధ్యత ఉంటుందని గ్రహించరు. ఈ విషయంలో నాకు అమితాబ్‌ బచ్చన్‌ ఆదర్శం. సక్సెస్‌ వచ్చినా ఫెయిల్యూర్‌ వచ్చినా ఆయన స్పందించే తీరు ఒకేలా ఉంటుంది. ఇప్పుడిప్పుడే నాకూ ఆ తీరు అలవాటు అవుతోంది' అని చెబుతోంది శ్రుతి.


నాని, నిత్యా మీనన్ కాంబినేషన్ లో దర్శకురాలు బి.వి. నందినిరెడ్డి రూపొందించిన అలా మొదలైంది చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ రైట్స్ అరకోటికి పైగా అమ్ముడైనట్లు సమాచారం. తమిళంలో రెగ్యులర్ సినిమాలు తీస్తున్న ఓ లీడింగ్ ప్రొడ్యూసర్ ఈ రైట్స్ ని తీసుకున్నట్ల చెప్తున్నారు. అలాగే మళయాళ పరిశ్రమనుంచి కూడా రీమేక్ రైట్స్ కు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం హిట్ కు నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ కారణం చెప్తూ..ఇది సింపుల్ పాయింట్ మీద తీసిన సినిమా. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్‌ప్లే. స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం అందుకే వర్కవుట్ అయింది అన్నారు.

చిత్ర కథ ప్రకారం...గౌతమ్(నాని) ఇష్టపడ్డ అమ్మాయి సిమ్రాన్(కీర్తి కర్బంధ) అతనికి హ్యాండిచ్చి ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి ప్రెండ్స్ బలవంతం మీద వెళ్ళిన గౌతమ్ కి అక్కడ నిత్య(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. నిత్య ది కూడా సేమ్ సమస్యే. ఆ పెళ్ళికొడుకు(డాక్టరు) ఆమెకు హ్యాండిచ్చి సిమ్రాన్ ని పెళ్ళి చేసుకుంటూంటాడు. దాంతో ఒకే సిట్యువేషన్ లో ఇరుక్కున్న ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని ప్రెండ్స్ అవుతారు. అక్కడనుంచి రకరకాల సంఘటనలతో వీరిద్దరి మధ్యా ప్రేమ మొలకెత్తుతుంది. అయితే వీళ్ళు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునేలోగా వీరికి రకరకాల మలుపులు,మనుష్యులు అడ్డంగా నిలుస్తారు. ఈ క్రమంలో వీటిన్నటినీ అధిగమించి వీరిద్దరూ ఎలా కలుస్తారనేది సరదాగా రూపొందించిన కథనం.

English summary
Shruti says, “I sang for Imman a couple of days ago and it’s a fun song.” Imman informs that the song will be “like an item number” and will be picturized on Gautham Karthik and the film’s second female lead Nikesha Patel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu