»   » ఇలా అనేస్తారని ఊహించలేం :కమల్ హాసన్ ఓ ఇడియట్‌.. ఆయనను రానివ్వను

ఇలా అనేస్తారని ఊహించలేం :కమల్ హాసన్ ఓ ఇడియట్‌.. ఆయనను రానివ్వను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి.. నటుడు కమల్‌ హాసన్‌పై సోషల్‌మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనో ఇడియట్‌ అని ఎద్దేవా చేయటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

సతీశ్‌రాజారామ్‌ అనే నెటిజన్‌ స్వామితో ట్విటర్‌లో సంభాషిస్తూ..'కమల్‌ భాజపాలో చేరి తనకు నచ్చినట్లుగా ప్రభుత్వాన్ని పాలిస్తే మీరు ఒప్పుకుంటారా?' అని అడిగాడు. ఇందుకు స్వామి సమాధానమిస్తూ..'భాజపా గురించి నాకు తెలీదు కానీ నేను మాత్రం బోన్‌లెస్‌ వండర్‌, ఇడియట్‌లాంటి కమల్‌హాసన్‌ను రానివ్వను' అని ట్వీట్‌ చేశారు.

దీనిపై వెంటనే స్పందించిన కమల్‌..'ఆయన చేసిన వ్యాఖ్యకి నేను ప్రతినింద వేయను. రాజకీయాల్లో ఆయనకి నాకంటే ఎక్కువ అనుభవజ్ఞుడు. ఆయనకి బోన్‌లెస్‌ మీల్‌ అంటే ఇష్టమేమో. కానీ నాకు నచ్చదు' అని ట్వీట్‌తోనే తిప్పికొట్టారు కమల్‌.

Subramanian Swamy calls Kamal Haasan a pompous idiot on Twitter

ఇదిలా ఉంటే... జయలలిత మరణించిన తర్వాత తమిళ నటుడు కమల్ హాసన్ వరుస ట్వీట్లతో శశికళ వర్గంపై దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్వీట్లు చేస్తూ జయలలితపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. జయలలితపై ఆగ్రహం కారణంగానే ఆయన ఆ పనిచేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జయపై ఆయనకు ఎందుకు కోపమనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. బహుశా, విశ్వరూపం సినిమా విడుదల సమయంలో జయలలిత ప్రదర్శించిన వైఖరిపై కసితో ఆయన రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గిన తర్వాత కూడా ఆయన తన ట్వీట్ల దండకాన్ని ఆపడం లేదు.

జయలలిత మృతి, సుప్రీం తీర్పు, ముఖ్యమంత్రి ఎన్నిక పరిణామాల నేపథ్యంలో ఆయన సంచలనమైన ట్వీట్లు చేశారు. తాజాగా ఆయన మరోసారి తన ట్వీట్ల దూకుడు చూపించారు. విశ్వాస పళనిస్వామి గెలిచినప్పటికీ ఫలితాన్ని తాను అంగీకరించబోనని అన్నారు.

దోషిగా తేలిన శశికళ, ఆమె కుటుంబసభ్యులు కలిసి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నిలబెట్టారని, ఆదో నేరస్తుల గుంపు అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. దివంగత సీఎం జయపై కూడా నేరారోపణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. విశ్వరూపం వివాదం నాటి పరిస్థితులను కమల్ ఇంకా మరిచిపోలేకనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జయలలిత తీరు పట్ల అప్పట్లో కమల్ హాసన్ తీవ్రంగా ప్రతిస్పందించారు

విశ్వరూపం సినిమా సమయంలో జయలలిత కమల్ హాసన్‌ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కమల్ నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం సినిమాను విడుదల చేసిన రోజే టీవీల్లో ప్రసారం చేస్తారనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా డీటీహెచ్ హక్కులను ముందస్తుగానే అమ్మేశారు. దానివల్ల థియేటర్‌లో ఎవరూ సినిమా చూడరని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కమల్ హాసన్ ఒప్పందాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు పిర్యాదు చేశారు.

అప్పటికే జయలలితకు కమల్ హాసన్‌పై మండిపోతున్నారని సమాచారం. సినిమా శాటిలైట్ హక్కులను అన్నాడీఎంకేకు చెందిన ఛానల్‌కు ఇచ్చేందుకు కమల్ నిరాకరించడమే దానికి కారణమనేది చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో విశ్వరూపం సినిమాపై పలు ముస్లిం సంస్థలు అభ్యంతరం చెప్పుతూ ఆందోళనలకు దిగాయి. దీంతోవ్యవహారం రాజకీయం రంగు పులుముకుంది. దీంతో సినిమాను నిషేధిస్తూ జయ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కమల్ హాసన్ మద్రాసు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆయన ఊరట లభించింది. కానీ జయ ప్రభుత్వం దాన్ని తమిళనాడు హైకోర్టులో సవాల్ చేసింది. ఆ వివాదం కొన్ని రోజుల తర్వాత గానీ సమసిపోలేదు. పళని విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత కమల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమతుల్యంతో వ్యవహరించే రాజకీయ నాయకులంటే ప్రజలకు ఇష్టమని, అయితే తనతోపాటు ప్రజలు ఇప్పుడు కోపంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

English summary
Courting yet another controversy, the former Union Minister Subramanian Swamy said that he will oppose actor Kamal Haasan who is a "boneless wonder and pompous idiot".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu