»   » ఇక్కడ డిజాస్టర్....అక్కడేమో సీక్వెల్ కి సిద్దం.

ఇక్కడ డిజాస్టర్....అక్కడేమో సీక్వెల్ కి సిద్దం.

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అల్లరి నరేష్ హీరోగా రీసెంట్ గా వచ్చి,డిజాస్టర్ అయిన చిత్రం జంపు జిలాని. ఈ చిత్రం తమిళ చిత్రం 'కలగలప్పు' రీమేక్ గా రూపొందింది. అయితే ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. తెలుగులో జంపు జిలాని హిట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ సీక్వెల్ ని కూడా తెలుగులో రీమేక్ చేసేవారు. అయితే ఇప్పుడా అవకాసం లేకుండా పోయింది. అదెలా ఉన్న అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రం ఇక్కడ రీమేక్ అయి ..డిజాస్టర్ అవటం, అక్కడ మరో సీక్వెల్ కి సిద్దమవటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

సుందర్‌.సి దర్శకత్వంలో విమల్‌, శివ, అంజలి నటించిన చిత్రం 'కలగలప్పు'. ప్రస్తుతం ఈ సినిమా రెండోభాగం కథ సిద్ధమైంది. అయితే ఇందులో విమల్‌, శివకు బదులుగా ఆర్య, జీవా నటిస్తున్నట్లు సమాచారం. ఆర్యకు జంటగా నయనతార, జీవా సరసన త్రిష నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సుందర్‌.సి 'అరణ్మనై' చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. అది పూర్తికా

గానే 'కలగలప్పు' సీక్వెల్‌ ఆరంభమవుతుందట. 'అరణ్మనై' సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో సుందర్‌.సి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని వినికిడి. పాత కథను కొనసాగిస్తూ.. అదే జోరుతో 'కలగలప్పు 2' కోసం స్క్రిప్ట్‌ను కూడా ముగించారట. కథను విన్న కొత్త హీరోలు కూడా నటించేందుకు అంగీకారం చెప్పారు. ఇక సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యమని చెబుతున్నాయి కోలీవుడ్‌ వర్గాలు.

Sundar C's Kalakalappu sequel to start rolling

అల్లరి నరేష్ సినిమాలకు వాళ్లు వీళ్లు అని తేడాలేకుండా అంతా వెళ్లి కాస్సేపు నవ్వుకుని వద్దామనుకుంటారు. అయితే అతను ఈ మధ్యన వైవిధ్యం పేరుతో చేస్తున్న లడ్డు బాబు లాంటి సినిమాలు వర్కవుట్ కావటం లేదు. కామెడీకోసం ఆశించి వెళ్లిన వారికి నిరాశే మిగులుస్తున్నాయి. ఈ నేఫద్యంలో ఇది ప్రయోగం కాదని, రెగ్యులర్ అల్లరి నరేష్ సినిమా అంటూ దర్శక,నిర్మాతలు చెప్తూ వస్తున్న చిత్రం ఇది. దానికి తోడు ఇది తమిళంలో విజయవంతమైన 'కలగలపు' కి రీమేక్ కావటం కూడా సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తొలిసారిగా అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం చేసారు. కానీ తీవ్రంగా నిరాశపరిచింది.

తాత సంపాదించిన హోటల్‌ ని అబివృద్ధి చేయాలనే లక్ష్యంతో మనవళ్లు ఏం చేసారనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది ఇద్దరు అన్నదమ్ములు కథ. వారసత్వంగా వచ్చిన ఆస్తిని కాపాడుకోవటానికి హీరోలు ఇద్దరూ ఎన్ని పాట్లు పడ్డారన్నది ఈ చిత్రం కథాశం. మరి సీక్వెల్ లో ఏం చేస్తారో చూడాలి.

English summary
In a recent interview, Sundar C said that he was pretty confident on Kalakalappu and its success. On his plans on Kalakalappu 2, he revealed that it will not exactly be a sequel and will have a different storyline and characterization.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu