»   » వావ్...సందీప్ కిషన్ సినిమాని రజనీకాంత్ మెచ్చుకున్నారు

వావ్...సందీప్ కిషన్ సినిమాని రజనీకాంత్ మెచ్చుకున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ చిత్రం చూసి, ఆ సినిమా టీమ్ ని మెచ్చుకోవటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అదృష్టం సందీప్ కిషన్ కు దక్కిందని తెలుస్తోంది.

సందీప్ కిషన్ రీసెంట్ గా చేసిన తమిళ చిత్రం 'మానగరం' తమిళంలోనే గాక తెలుగులో కూడా 'నగరం' పేరుతో విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తూ హిట్ దిశగా దూసుకుపోతోంది. ప్రేక్షకులు, విమర్శకులు కూడా సందీప్ కిషన్ కెరీర్లో ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు. ఈ నేపధ్యంలో రజనీ కూడా ఈ చిత్రం చూసి మెచ్చుకున్నారని సమాచారం.

కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ కు వచ్చి, చూసి, సినిమా యూనిట్ అంతటిని పిలిచి అభినందనలు తెలియచేసారట. సినిమా మంచి ఉత్సకతతో కూడిన నేరేషన్ తో , తనని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టిందని మెచ్చుకున్నారని సమాచారం.

Super Star appreciates Sundeepkishan's Nagaram

ఇదిలా ఉంటే... ఇప్పటికే సందీప్ కిషన్ కి ఫ్రెండ్స్ అయిన యంగ్ హీరోలు నాని, సుశాంత్ లు కూడా సందీప్ కిషన్ కు తమ వంతు సపోర్ట్ అందిస్తున్నారు. సినిమా చూసి నచ్చడంతో తమ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా చిత్రం బాగుందని, మంచి స్క్రీన్ ప్లే అని, నటీనటులు, ఇతర టీమ్ బాగా కష్టపడ్డారని, తప్పక చూడవలసిన సినిమా అని పోస్ట్ లు పెడుతూ... సినిమా సక్సెస్ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ కు జంటగా రెజీనా నటించింది. అశ్వినీ కుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై రూపొందిన చిత్రం 'నగరం.

చిత్ర సమర్పకులు అశ్వనీ కుమార్‌ సహదేవ్‌ మాట్లాడుతూ... ''ఒక నగరంలో 48 గంటల్లో నలుగురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. సందీప్‌ కిషన్‌ది ఒక స్టోరీ కాగా, రెజీనాది మరో స్టోరీ. శ్రీ అనే వ్యక్తిది ఇంకో స్టోరీ. ఈ మూడు స్టోరీలను కలుపుతూ ఒక డ్రైవర్‌ కథ వుంటుంది. ఈ నాలుగు కథలూ ప్యారలల్‌గా రన్‌ అవుతూ వుంటాయి. ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ మూవీ. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో సందీప్‌ కిషన్‌, రెజీనాలపై చిత్రీకరించిన ఒక మాంటేజ్‌ సాంగ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా కాకుండా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన కమర్షియల్‌ మూవీ ఇది. తప్పకుండా 'నగరం' మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటించిన చిత్రానికి జావేద్‌ రియాజ్‌, శశాంక్‌ వెన్నెలకంటి, సెల్వకుమార్‌ ఎస్‌కె., సతీష్‌కుమార్‌, ఫిలోమిన్‌ రాజు పనిచేసిన సాంకేతిక వర్గం.

English summary
Rajini watched a special screening of Sundeep Kishan's Nagaram and called up the movie’s unit and congratulated them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu