»   » మాణిక్ బాషా... రెండోసారి... ఈట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోయేలా ఉంది (వీడియో)

మాణిక్ బాషా... రెండోసారి... ఈట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోయేలా ఉంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu


రజనీకాంత్ కెరీర్లో బాషా సినిమాకి ప్రత్యేక స్థానం ఉన్నది. మాఫియా డాన్ గా, సాదారణ ఆటో డ్రైవర్ గా అయన చేసిన పాత్రలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. రజనీకాంత్ క్రేజ్ ని మరింతగా పెంచిన సినిమా ఇది. రజనీకాంత్ కెరీర్‌లో హిట్‌ అయిన సినిమాలలో 'బాషా' కూడా ఒకటి. మాఫియా సినిమాలకు నాందిగా ఈ మూవీకి పేరు కూడా ఉంది. ఈ నేపధ్యలో ఈ మూవీకి సీక్వెల్‌ రానున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్‌ లేదని, అదే సినిమాను డిజిటల్ వెర్షన్‌లో మరోసారి రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తుంది.

అంతకుముందు కూడా ఇలా రజనీకాంత్ పుట్టినరోజున శివాజీ సినిమాని త్రీడీ చేసి వదిలారు. అలాగే ఇప్పుడు బాషా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'బాషా' సినిమా అప్పుడప్పుడు టీవీ చానల్స్ లో వస్తూనే వుంది. ఇంటర్నెట్ లోను అందుబాటులో వుంది. అయినా ఈ సినిమాను థియేటర్లకు తీసుకురానుండటం విశేషం.

ఎవరూ మర్చిపోలేరు:

ఎవరూ మర్చిపోలేరు:

నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే... భారతీయ సినిమా ముఖ్యంగా తమిళ సినిమా ఉన్నంతకాలం ఈ డైలాగ్‌ని ఎవరూ మర్చిపోలేరు. ‘బాషా'గా రజనీకాంత్‌ ప్రదర్శించిన స్టైలు, నటన ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోయింది. ఇటువంటి సినిమా మళ్లీ రాదంటూ ఇన్నాళ్లూ అభిమానుల మదిలో ఉన్న మాట అప్పుడప్పుడూ రజనీకాంత్‌ నోట వినపడింది.

బాషా ని మించిన సినిమా లేదు:

బాషా ని మించిన సినిమా లేదు:

అవును, ‘బాషా'ని మించిన సినిమా లేదు, రాదు అని రజనీకాంత్‌ స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మించిన, మాజీ మంత్రి ఆర్‌ఎం వీరప్పన్‌ 90వ జన్మదిన వేడుక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రజనీకాంత్‌ ‘బాషా' జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘కబాలి' చిత్రం ‘బాషా'ని మించిపోతుందా అని చాలా మంది అడుగుతున్నారని చెబుతూ... ‘బాష'ని మించిన సినిమా లేదు, రాదు అని రజనీకాంత్‌ అనటం. అందరికీ మళ్ళీ మాణిక్ భాషా ని గుర్తుకు తెచ్చింది.

వీరప్పన్ మంత్రి పదవి పోయింది:

వీరప్పన్ మంత్రి పదవి పోయింది:

ఆర్‌వి.వీరప్పన్ నిర్మించిన బాషా చిత్రంలో నేను నటించాను.ఆ చిత్ర 125 రోజు విజయోత్సవంలో పా ల్గొన్న నేను బాంబుల సంస్కృతి గురించి మాట్లాడాను. ఆ మరునాడే వీరప్పన్ మంత్రి పదవి పోయింది.నాకు చాలా బాధేసింది.ఈ విషయాన్ని ఆయనకు ఫోన్ చేసి చెప్పాను.అప్పుడాయన నవ్వుతూ ఇది కాల నిర్ణయం అంటూ సర్వ సాధారణంగా అన్నారు.అంటూ అప్పటి సంఘటనని గుర్తు చేసుకుంటూనే డిజిటల్ భాషా గురించి ఒక సూచన కూడా చేసాడు.

పంచ్‌ డైలాగ్‌:

పంచ్‌ డైలాగ్‌:

రజనీకాంత్ సీని చరిత్రలో ఈ చిత్రం ఓ మైలురాయి. ఈచిత్రంలో రజనీ మేనరిజం, స్టైల్ అదుర్స్ అంటూ చాలా మంది ఆయనకు అభిమానులైపోయారు. - హీరోయిజాన్ని స్పష్టం చేసే సంభాషణ ఇది. రజనీకాంత్‌ నటించిన 'బాషా' చిత్రంలోని ఈ పంచ్‌ డైలాగ్‌ని ప్రేక్షకులు మరచిపోలేరు. 1995లో వచ్చిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఆ చిత్ర కథన శైలి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు రచయితలు.

 డిజిటలైజ్‌ చేసిన రీమాస్టర్డ్‌ ‘బాషా’:

డిజిటలైజ్‌ చేసిన రీమాస్టర్డ్‌ ‘బాషా’:

ఫ్లాష్‌బ్యాక్‌లో బాషాగా రజనీ తన నట విశ్వరూపం చూపడంతో మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ థియేటర్లకు జనాలు పోటెత్తారు. అప్పటినుంచే మన సినిమాల్లో కథానాయకుడికి ఓ పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ను జోడించే సరికొత్త ఫార్ములా మొదలైంది. రజనీ కెరీర్‌లోనే మోస్ట్‌ స్టైలిష్‌ ఫిల్మ్‌గా అభిమానులు భావించే ఈ సినిమా త్వరలో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజ్‌ చేసిన రీమాస్టర్డ్‌ ‘బాషా'ను త్వరలో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

బ్లాక్ బస్టర్లకే బ్లాక్ బస్టర్:

బ్లాక్ బస్టర్లకే బ్లాక్ బస్టర్:

1995లో వచ్చిన బాషాను బ్లాక్ బస్టర్లకే బ్లాక్ బస్టర్ అనాలి. ఇప్పుడు ఆ బాషాను డిజిటల్ వెర్షన్ లో సిద్ధం చేస్తున్నారు. తాజాగా డిజిటల్ బాషాకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. మాణిక్యంగా బతుకుతున్న బాషా ఫ్యాష్ బ్యాక్ ప్రారంభమయ్యే సీన్ ని టీజర్ లో ఇచ్చారు. 'నా ఒరు తడవ సొన్న.. నూరు తడవ సొన్న మాదిరి(నే ఒక్క సారి చెబితే.. వందసార్లు చెప్పినట్లే)' అంటూ రజినీ పేల్చే హైలైట్ పంచ్ డైలాగ్ తో టీజర్ క్లోజ్ అవుతుంది. చూసిన సినిమానే అయినా.. ఇప్పటి హై క్వాలిటీ విజువల్స్ తో.. 5.1సరౌండ్ సౌండ్ తో బాషా మరోసారి ఎటాక్ చేయబోతున్నాడు.

డిజిటల్ వెర్షన్ గా :

బాషాలో రజినీకాంత్ మాఫియా డాన్ గా నటించడమే హైలైట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా కబాలి మూవీకి ఇంత క్రేజ్ రావడానికి కారణం కూడా.. మళ్లీ 21 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మాఫియా రోల్ చేయడమే. ఇప్పుడు మరి బాషానే మళ్లీ డిజిటల్ వెర్షన్ గా వస్తున్నాడు. ఈసారి ఎన్ని రికార్డులు బద్దలవుతాయో!

English summary
After 20 years, the Super Star 's mega blockbuster Basha is getting spruced up as it will be digitized and released once again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu