»   »  అఫీషియల్ :రజనీ కాంత్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు!

అఫీషియల్ :రజనీ కాంత్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అభిమానులు ఎదురుచూస్తున్న రజనీకాంత్ చిత్రానికి టైటిల్ ఖరారు అయ్యింది. రజనీకాంత్ రెండు ఫ్లాప్ ల తర్వాత రంజిత్ అనే దర్శకుడితో ఓ కొత్త చిత్రం కమిటైన విషయం తెలిసిందే. ‘అట్టకత్తి', ‘మద్రాస్' సినిమాల ద్వారా ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న రంజిత్, రజనీ కోసం ఓ గ్యాంగ్‌స్టర్ కథను రెడీ చేశారు. ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల పేర్లు వినపడగా చివరగా దర్శకుడు, కబలి అనే పేరు ఖరారు చేశారు.

కబాలీశ్వరన్ అనే చెన్నైకి చెందిన డాన్ నిజ జీవితం నుంచి ప్రేరణ పొందిన సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. మరోప్రక్క రజనీకాంత్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారని, నటనకు సంబంధించిన వర్క్ షాప్ లోనూ సిన్సియర్ గా పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక రాధికా ఆప్టే హీరోయిన్ గా ఎంపికయ్యిందని అంటున్నారు. కళైపులి ఎస్. థాను నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జెడీ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. గ్యాంగ్ లు, గ్యాంగ్ వార్ లు అంటూ సాగే ఈ చిత్రంలో జెడి గ్యాంగ్ కే రజనీ కౌంటర్ ఇవ్వనున్నట్లు వినికిడి. ఈ తరహా పాత్రలో గతంలోనూ జెడీ కనిపించటంతో ఫెరఫెక్ట్ ఎంపిక అని చెన్నై వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు జెడీ ఇప్పటికే మలేషియా చేరుకున్నట్లు సమాచారం. ఈ చిత్రలో రజనీకాంత్ మాఫియా నుంచి రిటైరయిన వ్యక్తిగా కనిపిస్తారు. కొన్ని అత్యవసర పరిస్ధితుల్లో ఆయన తిరిగి మాఫియా ముఠాలతో పోరాటం చేయటమే కధాంశం అంటున్నారు. సినిమా మొత్తం థ్రిల్స్ తో నిండి ఉంటుందంటున్నారు.

 Superstar Rajani Kanth's next titled as Kabali!

ఈ సినిమా ఎలా ఉండబోతోంది?.. . రజనీకాంత్‌ సరసన ఎవరెవరు నటిస్తున్నారు?.. రంజిత్‌ శైలిలో వాస్తవిక సినిమానా?.. అంటూ పలు రకాల ఆలోచనలో పడ్డారు అభిమానులు. గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన కథతో రూపొందించనున్నట్లు కోడంబాక్కం సమాచారం. రజనీకాంత్‌ ఓకే చెప్పిన వెంటనే.. రంజిత్‌ ప్రస్తుతం విదేశాల్లో లొకేషన్లు వెతికే పనిలో పడ్డారు. ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు.

దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్. రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్. తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు.

గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.

English summary
Superstar Rajinikanth's upcoming flick under the direction of 'Madras' fame Pa.Ranjith has been titled as 'Kabali'. The title is confirmed by the makers on the eve of Rajini's 40 Years in the Film Industry.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu