For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాపారాయుడు మళ్లీ : రజనీ 'కబాలి' ఫస్ట్ లుక్ (ఫొటోలు)

  By Srikanya
  |

  చెన్నై : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను తమిళనాట మాత్రమే కాక సౌతిండియా అంతటా అభిమానులు విపరీతంగా ఇష్టపడతారు. వయస్సు మీద పడినా తన అభిమాన నటుడిని యువకుడిగానే భావిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ లుక్ ..గతంలో పెద రాయుడు చిత్రంలో రజనీ చేసిన పాపారాయుడు లుక్ ని గుర్తు చేస్తుందంటున్నారు.

  ఈ చిత్రలో రజనీకాంత్ మాఫియా నుంచి రిటైరయిన వ్యక్తిగా కనిపిస్తారు. కొన్ని అత్యవసర పరిస్ధితుల్లో ఆయన తిరిగి మాఫియా ముఠాలతో పోరాటం చేయటమే కధాంశం అంటున్నారు. సినిమా మొత్తం థ్రిల్స్ తో నిండి ఉంటుందంటున్నారు.

  రజనీ కొత్తగా నటించనున్న చిత్రం 'కపాలి'. ఈ చిత్రంలో రజనీ ఏ గెటప్‌లో నటిస్తారో తెలియక ఒకొక్కరు ఒక్కో విధమైన స్త్టెల్‌ చిత్రాలను వెబ్‌సైట్లలో ఉంచుతున్నారు. ఈ విధంగా రూపొందించిన పోస్టర్లలో చాలావరకు రజనీకాంత్‌ తెలుపు గడ్డంతోనే కనిపిస్తారంటూ వూహా చిత్రాలు రూపొందించారు. ఆ ఫస్ట్ లుక్ ఫొటోలు కొన్ని ఇక్కడ మీకు అందచేస్తున్నాం.

  ఈ తరహా గెటప్‌లో కనిపించాలనేదే తమ కోరికగా చెబుతున్నారు. గతంలో రజనీకాంత్‌ 'ధర్మదురై' చిత్రంలో కనిపించిన గెటప్‌లోనే ప్రస్తుత కపాలీ చిత్రంలో కూడా కనిపించాలనేది అనేక మంది కోరికగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చిత్ర యూనిట్ మాత్రం రజనీ గెటప్‌ను చూడాలంటే కాస్త వేచి ఉండాలనే చెబుతోంది.

  ఫొటోలు..స్లైడ్ షోలో...

  ప్రీ ప్రొడక్షన్

  ప్రీ ప్రొడక్షన్

  రజనీకాంత్‌ తదుపరి సినిమా 'కబాలి' ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న సంగతి తెలిసిందే.

  ఆసక్తిగా...

  ఆసక్తిగా...

  ఈ చిత్రం గురించి రజనీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

  ఈ నేపధ్యంలో చిత్రం యూనిట్ మాట్లాడుతూ...

  ఈ నేపధ్యంలో చిత్రం యూనిట్ మాట్లాడుతూ...

  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సెప్టెంబరు 17వ తేదీన విడుదల కానుందన్నారు.

  మలేషియాలో

  మలేషియాలో

  ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ పనులు మలేషియాలో జరుగుతున్నాయి.

  ఎప్పటినుంచి

  ఎప్పటినుంచి

  సెప్టెంబరు నెలలో షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు చిత్రం బృందం వివరించింది.

  ఫొటో షూట్

  ఫొటో షూట్

  ఈ చిత్రం ఫొటో షూట్‌ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు.

  రీసెంట్ గా

  రీసెంట్ గా

  అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా హై ఫ్రొఫైల్ ఫొటో షూట్ జరిగింది.

  ఇక్కడ వాడు కాదు

  ఇక్కడ వాడు కాదు

  కొరియన్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో షూట్ చేసారు

  లుక్ ఎలా ఉంటుందంటే

  లుక్ ఎలా ఉంటుందంటే

  రజనీ లుక్..సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ తో కూడిన విగ్, దాదాపు 1991లో ఆయన చేసిన ధర్మ దురైలో గెటప్ లాగ ఉంటుంది.

  మేకప్

  మేకప్

  బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు ఈ ఫొటో షూట్ కోసం ప్రత్యేకమైన మేకప్ చేసారు.

  అవుట్ పిట్

  అవుట్ పిట్

  ఫొటో షూట్ లో రాధికా ఆప్టే ఎనభైల నాటి అవుట్ ఫిట్ తో ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సెప్టెంబర్ రెండవ వారంలో బయిటకు వస్తుంది.

  డాన్ గా..

  డాన్ గా..

  చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు.

  బ్యాక్ డ్రాప్ లో

  బ్యాక్ డ్రాప్ లో

  సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు.

  ఎందుకంటే..

  ఎందుకంటే..

  దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది. కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు.

  ఇలాంటి కథ

  ఇలాంటి కథ

  అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

  చిత్రానికి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్‌' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్‌ ఒరిజినల్‌ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

  హీరోయిన్ రాధికా ఆప్టే తో ఫార్మల్ ఫోటో షూట్ నిర్వహించినట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్‌ అసలైన రూపంలో అంటే మేకప్ లేకుండానటిస్తున్నారని ఆదివారం నుంచి ప్రచారమవడంతో దీనికి సంబంధించిన ఫ్యాన్స్‌మేడ్‌ ఫొటోలు కూడా దర్శనం ఇస్తున్నాయి. సినిమాలో ఒరిజనల్ లుక్ తో మేకప్ లేకుండా కనపడినా ...ఫ్లాష్ బ్యాక్ సీన్లలో మాత్రం మేకప్ వేసి లుక్ మారుస్తారని చెప్తున్నారు.

  English summary
  Rajini will be seen portraying the role of 'Vinayagar Chathurthi', a Chennai don, in the movie. Shooting begins soon and release planned in the first half of 2016. Entire Talkie Part and Songs will be completed within just 3 months.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X