»   » రజనీ కొత్త చిత్రం గురించి షాకిచ్చే విషయం

రజనీ కొత్త చిత్రం గురించి షాకిచ్చే విషయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్‌ తదుపరి సినిమా 'కబాలి'కి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్‌' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్‌ ఒరిజినల్‌ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో రజనీకాంత్‌ అసలైన రూపంలో అంటే మేకప్ లేకుండానటిస్తున్నారని ఆదివారం నుంచి ప్రచారమవడంతో దీనికి సంబంధించిన ఫ్యాన్స్‌మేడ్‌ ఫొటోలు కూడా దర్శనం ఇస్తున్నాయి. రజనీకాంత్ మేకప్ లేకుండా నటిస్తాడా..నటిస్తే ఎలాఉంటారు అనేది ఇప్పుడు అబిమానుల్లో హాట్ టాపిక్ గా షాకింగ్ విషయం గా మారింది. అయితే సినిమాలో ఒరిజనల్ లుక్ తో కనపడినా ...ఫ్లాష్ బ్యాక్ సీన్లలో మాత్రం మేకప్ వేసి లుక్ మారుస్తారని చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడెప్పుడు కొత్త సినిమాతో వస్తారా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూంటారు. ఆ ఎదురుచూపులు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే...ఆయన రీసెంట్ చిత్రం 'లింగ' అంచనాలు తలక్రిందులు చేసి ఫ్లాప్ కావటంతో తదుపరి చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఎవరూ వూహించనివిధంగా ఆయన కొత్త దర్శకుడు రంజిత్‌కు అవకాశమిచ్చారు. ఓకే డైరక్టర్ ఖరారు అయ్యారు. దాంతో ఈ చిత్రం టైటిల్ ఏమిటి..కథ ఏమిటి అనే విషయాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

Superstar Rajini’s new getup spreading viral! ?

ఈలోగా ఇదే టైటిల్ అంటూ ఓ వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ ఏంటంటే... 'కన్నాభిరాన్ ' సినిమాలో ఎక్కువ భాగం మలేషియాలో జరగనుంది. దర్శకుడు అమీర్ ఈ టైటిల్ ని గతంలో రిజిస్టర్ చేసారు. కానీ సినిమా ప్రారంభంకాలేదు. దాంతో ఇప్పుడా టైటిల్ ని అమీర్ నుంచి అడిగి తీసుకోవటం జరిగింది. రజనీకూడా ఈ టైటిల్ ని చాలా ఇష్టపడుతున్నట్లు చెప్తున్నారు. గతంలోనూ అమీర్ రిజిస్టర్ చేసిన లింగా టైటిల్ నే రజనీ టైటిల్ కు పెట్టారు. ఈ విషయమై దర్శకుడు అమీర్ చాలా ఆనందంగా ఉన్నారు. తన టైటిల్ ని రజనీ సినిమాకు పెట్టడం తను ఆనందపడే విషయమని చెప్పుకొచ్చారు.

ఇంతకీ...

ఈ సినిమా ఎలా ఉండబోతోంది?.. . రజనీకాంత్‌ సరసన ఎవరెవరు నటిస్తున్నారు?.. రంజిత్‌ శైలిలో వాస్తవిక సినిమానా?.. అంటూ పలు రకాల ఆలోచనలో పడ్డారు అభిమానులు. గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన కథతో రూపొందించనున్నట్లు కోడంబాక్కం సమాచారం. రజనీకాంత్‌ ఓకే చెప్పిన వెంటనే.. రంజిత్‌ ప్రస్తుతం విదేశాల్లో లొకేషన్లు వెతికే పనిలో పడ్డారు.

ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్.

రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు.

తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.

English summary
The next Rajinikanth film, which will be directed by Pa. Ranjith, will be called Kabali and he will be reportedly playing the role of a don in the film. Director said that Rajinikanth's new film will bring back Rajini, the actor, onscreen.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu