For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Rajinikanth 'జైలర్' ముత్తువేల్ పాండియన్ కమింగ్.. సూపర్ స్టైలిష్ గా ఫస్ట్ లుక్!

  |

  ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు రజనీ కాంత్. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు కుర్ర హీరోలు దూసుకుపోతున్నా.. తన హవాను ఏమాత్రం తగ్గించకుండా సత్తా చాటుతున్నారాయన. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న రజనీ కాంత్ పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 12). ఈ సందర్భంగా జైలర్ మూవీలోని రజనీ కాంత్ పాత్రను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు.

  బస్ కండక్టర్ గా ఉద్యోగం..

  బస్ కండక్టర్ గా ఉద్యోగం..

  రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్.. బెంగళూరులో స్థిరపడిన ఒక మరాఠా కుటుంబంలో 1950 డిసెంబర్ 12న జన్మించారు. చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌పై ఉన్న పిచ్చితో స్టేజ్‌లపై నాటకాలు వేసేవారు. ఆ తర్వాత బస్ కండక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు.

  ఈ క్రమంలోనే మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసి అందులో అడ్మిషన్ తీసుకున్నారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన తర్వాత రజినీకాంత్‌కు టాలెంట్‌కు అక్కడి వాళ్లు ముగ్ధులయ్యారు. ఆ సమయంలోనే లెజెండరీ డైరెక్టర్ బాలచందర్.. ఆయనలోని నైపుణ్యాన్ని చూసి 'అపూర్వ రాగంగళ్' అనే సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు.

  ఒకే బ్యానర్ లో రెండు చిత్రాలు..

  అపూర్వ రాగంగళ్ మూవీతో నటనలోకి అడుగుపెట్టిన రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు. రజనీ కాంత్ చివరిగా పెద్దన్న సినిమాతో అభిమానులను, ప్రేక్షకులను అలరించారు. తర్వాత ఆరోగ్యం కొద్దిగా బాగా లేకపోవడంతో సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చారు. ఆరోగ్యం కుదుటపడ్డ రజనీ కాంత్ వరుసపెట్టి సినిమాలు తీయనున్నారు.

  లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవే కాకుండా కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తూ సన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం జైలర్. ఈ మూవీకి కోకో కోకిల, వరుణ్ డాక్టర్, బీస్ట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.

  స్టైలిష్ ఎంట్రీ..

  స్టైలిష్ ఎంట్రీ..

  తలైవా రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ సినిమా వచ్చే ఏడాది తమిళ సంవత్సరాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 12 సోమవారం రజనీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా జైలర్ మూవీ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు.

  ఇందులో కుర్చీలో నుంచి లేచి పర్ఫ్యూమ్ కొట్టుకోవడం, స్పెక్ట్స్ పెట్టుకుని రజనీ నడవడం స్టైలిషి గా చూపించారు. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. ఈ వీడియోను షేర్ చేస్తూ "జైలర్ ముత్తువేల్ పాండియన్ వస్తున్నాడు. హ్యాపీ బర్త్ డే తలైవా. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్" అని ట్వీట్ చేశారు.

  హీరోయిన్ గా రమ్యకృష్ణ..

  హీరోయిన్ గా రమ్యకృష్ణ..

  రజనీ కాంత్ జైలర్ మూవీ ఒక సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో జరిగే కథ అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. గతంలో వీళ్లిద్దరు కలిసి నటించిన నరసింహా ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ జైలర్ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాలి.

  English summary
  Thalaiva Superstar Rajinikanth Nelson Dilip Kumar Combo Movie Jailer First Look Released On His Birthday. Rajanikanth Arrived As Muthhuvel Pandiyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X