»   » మరో సారి వార్తల్లోకి సూర్య సైన్స్ ఫిక్షన్ ధ్రిల్లర్ ‘24’, ఎందుకంటే

మరో సారి వార్తల్లోకి సూర్య సైన్స్ ఫిక్షన్ ధ్రిల్లర్ ‘24’, ఎందుకంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సైన్స ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 24. సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణే కాక విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకుడు.

సూర్య తన సొంత నిర్మాణసంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించాడు. విక్రమ్ కుమార్ అందించిన హాలీవుడ్ మార్కు విజువల్స్.. ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్.. అదిరిపోయాయ్. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా మరో సారి వార్తల్లోకి ఎక్కింది . అందుకు కారణం ఏమిటీ అంటే...

'24' చిత్రం చైనా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. తన సొంత బ్యానరైన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థపై రూపొందించిన '24'లో సూర్య త్రిపాత్రాభినయం పోషించారు. తండ్రీకుమారులుగా, విలన్‌గా సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించారు. టైమిషన్‌ కథతో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ కథ తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

24 క్యారెట్ బ్రిలియన్సి ...(సూర్య '24' రివ్యూ)

ఇదిలా ఉండగా ప్రస్తుతం చైనాలో జరుగుతున్న చిత్రోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 675 సినిమాలు ఎంపికయ్యాయి. ఇందులో సూర్య నటించిన '24' సినిమా కూడా ఉంది. ఈ చిత్రాన్ని తలికించిన ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తినట్లు సూర్య తరఫు వర్గాలు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

Suriya 24

వాస్తవానికి...సూర్య గతంలో చేసిన సికిందర్, బ్రదర్స్, రాక్షసుడు లాంటి సినిమాలు నిరాశ పరిచినా.. వెనుకంజ వేయకుండా '24' లాంటి ప్రయోగాత్మక సినిమా చేసినందుకు సూర్యను అప్రిషియేట్ చేయాల్సిందే. సూర్య చేసిన సాహసానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు వంద కోట్ల మార్కును అందుకున్నాయి.

తెలుగుతో పోలిస్తే తమిళంలో రెస్సాన్స్ అంత గొప్పగా ఏమీ లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది '24' తమిళ వెర్షన్. ఈ సినిమాను సూర్య స్వయంగా రూ.75 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఇప్పటిదాకా సూర్య సినిమాలకు తమిళంతో పోలిస్తే తెలుగులో సగం వసూళ్లు వచ్చినా ఎక్కువే అనుకునేవాళ్లు. కానీ '24' మాత్రం తమిళ వెర్షన్ కు దీటుగా వసూళ్లు సాధించింది. '24' తెలుగు వెర్షన్ మాత్రమే రూ.35 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. షేర్ రూ.20 కోట్లకు పైనే ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ '24' తెలుగు వెర్షన్ దుమ్ముదులిపింది.

English summary
Tamil actor Suriya’s latest blockbuster and science fiction thriller “24” movie have created a lot of records and earned earth-shattering collections at box office. Now another record is on the way for 24 movies. As per latest updates, Suriya 24 Movie will be screened at the 3rd Silk Road International film festival which will be started in China from September 23.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu