లండన్‌లో సూర్య, అల్లు శిరీష్, మోహన్ లాల్ మూవీ.. క్రేజీగా ప్రారంభం!
విలక్షణ తమిళ నటుడు సూర్య, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అల్లు శిరీష్, సాయేషా కలిసి నటిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ లండన్‌లో ప్రారంభమైంది. సూర్యకు ఈ చిత్రం 37వది. ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బొమన్ ఇరానీ తొలిసారి తమిళంలోకి అడుగుపెడుతున్నారు. లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
లండన్ మాత్రమే కాకుండా బ్రెజిల్, ఢిల్లీ, యూఎస్, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకొనే ఈ చిత్రానికి గేవ్‌మిక్ యూ ఆరీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడంపై హీరోయిన్ సాయేషా తన సంతోషాన్ని ట్విట్టర్‌లో వ్యక్తం చేశారు. డైనమేట్ సూర్య సరసన నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ సర్ తో స్క్రీన్ పంచుకొనే అవకాశం రావడం నిజంగా అదృష్టమే అని సాయేషా ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్‌జీకే అనే చిత్రంలో సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











