For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాతో సినిమా తీస్తావా అని బతిమాలా.. ఆ డైరెక్టర్ ప్రపంచాన్నే మరిచి.. NGK గురించి సూర్య ఎమోషనల్

|

దక్షిణాదిలో విలక్షణ నటుడు సూర్య మరో విభిన్నమైన చిత్రం ఎన్‌జీకే (నంద గోపాలకృష్ణ)తో ముందుకొస్తున్నాడు. 7జీ బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలను రూపొందించిన శ్రీ రాఘవతో జతకట్టాడు. ఖాకీ చిత్రాన్ని నిర్మించిన ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాకు నిర్మాతలు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందింది. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఆడియో రిలీజ్, ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య చేసిన ఉద్వేగ ప్రసంగం అందర్నీ ఆకట్టుకొన్నది.. ఆయన ఏమన్నారంటే..

 నా కల సాకారమైంది

నా కల సాకారమైంది

ఎన్‌జీకే చిత్రంలో నటించడం ద్వారా ఎన్నో ఏళ్లుగా నా మనసులో ఉన్న కల సాకారమైంది. ఈ చిత్రం ఓ పొలిటికల్ థిల్లర్ అని అందరూ అనుకొంటున్నారు. కానీ ఇది సరికొత్త కోణంలో తెరకెక్కించిన సినిమా ఇది. 2000 ఎన్నికల తర్వాత రాజకీయాలను నిశితంగా పరిశీలించిన దర్శకుడు శ్రీరాఘవ ఈ సినిమాను తెరకెక్కించాడు అని సూర్య అన్నారు.

నాతో సినిమా తీస్తావా అని

నాతో సినిమా తీస్తావా అని

ఇప్పటి వరకు ఏ డైరెక్టర్‌ను అడిగానో లేదో గుర్తు లేదు కానీ, శ్రీ రాఘవతో 2002లో నాతో సినిమా తీస్తావా అని అడిగాను. శ్రీ రాఘవ నుంచి ఏదైనా కాల్ వస్తుందా అని అప్పటి నుంచి నేను ఎదురుచూస్తు ఉన్నాను. ఈ అవకాశంతో నేను చాలా థ్రిల్ అయ్యాను. నా కల తీరిందని సంతోషపడ్డాను. ఎన్‌జీకే సెట్లో ఉంటే ప్రతీ రోజు కొత్తగా అనిపించేది. వివిధ విభాగాలపై శ్రీ రాఘవకు ఉన్న పట్టు చూసి వామ్మో అనుకొన్నాను అని సూర్య తెలిపారు.

 ఆయన ప్రపంచాన్నే మరిచిపోతాడు

ఆయన ప్రపంచాన్నే మరిచిపోతాడు

ప్రతీ సన్నివేశాన్ని ఊహకు అతీతంగా శ్రీరాఘవ తెరకెక్కించాడు. పనిలో నిమగ్నమయ్యాడంటే ప్రపంచాన్ని మరిచిపోతాడు. ఓ తపనతో సినిమాను తెరకెక్కిస్తారు. శ్రీరాఘవ వద్ద మరో కథ ఉంటే.. వెంటనే నటించడానికి నేను సిద్ధం. ఆయనతో పనిచేయడంలో ఉండే మజా నాకు క్లియర్‌గా తెలిసింది. మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలనే కోరిక కలిగింది అని సూర్య ఎమోషనల్ అయ్యాడు.

 డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ

ఎన్‌జీకే సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీశాం. ఫ్యాన్స్ ముఖ్యంగా ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. చిత్రంలో పనిచేసిన ప్రతీ ఒక్కరికి నా థాంక్స్. ప్రతీ ఒక్కరు సొంత ప్రాజెక్ట్ అనుకొని సినిమా చేశారు. ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఖర్చుకు వెనుకాడకుండా.. రాజీ పడకుండా ప్రభు, ప్రకాశ్ ఈ సినిమాను నిర్మించినందుకు థ్యాంక్స్. కథకు కావాల్సిన ప్రతీ అంశానికి మంచి సహకారం అందిందనే ఫీలింగ్ నాకు కలిగింది అని సూర్య అన్నారు.

మే 31న విడుదల

మే 31న విడుదల

అందాల భామలు సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఎన్‌జీకే చిత్రం మే 31న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో నిళగల్ రవి, ఉమా పద్మానాభన్, ఇళవరసు, పొన్వాన్, వేల్ రాంమూర్తి తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, శివకుమారన్ విజయన్ సినిమాటోగ్రఫి, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.

English summary
Suriya who has different image and is quite popular with his films 'Gajini' and 'Singam' Series is coming with an interesting political thriller 'NGK' (Nanda Gopala Krishna). '7G Brindavana Colony', 'Aadavari Matalaku Ardaale Verule' fame Sri Raghava is directing this film while SR Prakash Babu, SR Prabhu who recently delivered Superhit film like 'Khakee' are producing 'NGK' under Dreamwarrior Pictures along with Reliance Entertainments. Team released audio and trailer of the film in a grand event. Along with film unit, Suriya's Father Sivakumar, '2D Entertainments' Raja were also present at the event.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more