Don't Miss!
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Lifestyle
కరోనా పెరగడానికి ఈ 4 విషయాలు ప్రధాన కారణం ... జాగ్రత్తగా ఉండండి ...
- Automobiles
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పుత్రోత్సాహంలో సూర్య, జ్యోతిక.. వారి కుమారుడు ఇపుడు నేషనల్ ఛాంపియన్
పిల్లలు ఏదైనా రంగంలో విజయం సాధిస్తే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. తమ వారసుడిని చూసి గర్వపడే క్షణాలు అవి. తాజాగా సౌత్ స్టార్స్ సూర్య, జ్యోతిక తమ ముద్దుల కుమారుడు దేవ్ సాధించిన విజయం చూసి అలాంటి అనుభూతికే లోనవుతున్నారు.
దేవ్ తాజాగా న్యూ ఢిల్లీలో జరిగిన కరాటే ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. 9 ఏళ్ల ఈ స్టార్ కిడ్ ఇపుడు బ్లాక్ బెల్ట్ హోల్డర్. తమ కుమారుడు పోటీ పడ్డ ఈ ఛాంపియన్ షిప్‌లో సూర్య, జ్యోతిక స్వయంగా పాల్గొని ఎంకరేజ్ చేశారు. ఈ పోటీలో తమిళనాడు నుంచి 40 మంది పోటీపడ్డట్లు సమాచారం.

దేవ్ పెద్దయ్యాక యాక్షన్ హీరో అవుతాడా?
సూర్య కుమారుడు 9 ఏళ్ల వయసులోనే కరాటే నేషనల్ చాంపియన్ అయ్యాడంటే.... పెద్దయ్యాక సినిమా రంగంలోకి వచ్చి యాక్షన్ హీరోగా అవతరించడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేవ్ ప్రతిభ చూసి సూర్య అభిమానులు మురిసిపోతున్నారు.

అన్యోన్య దాంపత్యం
కోలీవుడ్ చిత్ర సీమలో సూర్య, జ్యోతిక పాపులర్ కపుల్. 2006లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల అన్యోన్య దాంపత్య జీవితానికి గుర్తుగా దేవ్, దివ్య జన్మించారు. పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్నారు.

కాప్పన్, ఎన్టీకె
సూర్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కాప్పన్, ఎన్జీకె చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఎన్టీకె చిత్రాన్ని మే 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 29న సాయంత్రం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాప్పన్ మూవీ ఆగస్టులో రానుంది.

జ్యోతిక, కార్తి
జ్యోతిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో జ్యోతిక సోదరుడి పాత్రలో కార్తి నటించనున్నారు. ఒక విభిన్నమైన కథతో థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతోందట.