హృదయాలు హత్తుకుంటున్న వీడియో.. అమ్మతో మాట్లాడండి, సూర్య ట్వీట్!
తమిళ హీరో సూర్య తాజగా తన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆదివారం మే 13 న మదర్స్ డే సందర్భంగా జెఎఫ్ డబ్ల్యూ మ్యాగజైన్ వారు ఈ వీడియోని రూపొందించారు. అమ్మ గురించి చక్కటి సందేశాన్ని ఇస్తూ ఈ వీడియోని రూపొందించారు. హృదయాల్ని హత్తుకునే విధంగా ఈ వీడియో ఉంది. మన జీవితాలలో అమ్మకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతని గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది.
ఈ వీడియోలో ఉన్నా సారాంశం విషయానికి వస్తే.. ఎవరికీ వారు వారి పనుల్లో బిజీగా ఉంటారు. అమ్మ ఫోన్ చేస్తున్నా పట్టించుకోరు. పదేపదే అమ్మ ఫోన్ చేస్తుండడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడగా.. భోజనం చేశావా నాన్నా అంటూ అమ్మ అడుగుతుంది.

తీరిక చేసుకుని మరీ అమ్మతో మాట్లాడండి, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయండి అంటూ హీరో సూర్య ట్విట్టర్ లో ఈ వీడియోని పొస్త్ చేశాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఉండకూడదు అనేదే ఈ వీడియో ఇచ్చిన సందేశం. ఆదివారం రోజు మదర్స్ డే కావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











