»   » సూర్య ‘24’ కథ..లీకైంది

సూర్య ‘24’ కథ..లీకైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ‘24' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత హీరోగా నటింస్తుండగా... మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ లీకైందంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆ లీకైన కథను మీ ముందు ఉంచుతున్నాం. నిజమా కాదా అనేది తేలాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

'24' సినిమాలో టైంమిషీన్ తరహా వాచ్ తయారు చేసిన సూర్య, దాని సాయంతో తన గతంలోకి వెళ్లి తాను చేసిన తప్పులను సరిద్దిదుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో సైంటిస్ట్ గా, అతని కొడుకుగా,ఆత్రేయ అనే విలన్ గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

Suriya's 24 leaked story

ఈ చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ రిలీజ్ చేయనున్నారు.

స్నేహితుడు అఖిల్ కోసం తొలిసారిగా నిర్మాతగా మారిన నితిన్... ఇప్పుడు గ్లోబల్ ఫిలిమ్స్ అనే సంస్థతో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా '24' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. 'ఇష్క్', 'మనం' చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విక్రమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో సూర్య హీరో. తమిళంలో ఆయనే నిర్మాత కూడా. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.

English summary
Here is the leaked story of Surya's 24. 24 is an upcoming Tamil science fiction thriller Tamil film written and directed by Vikram Kumar and Produced by Suriya and KE Gnanavel Raja.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu