»   » కెటీఆర్ ఐడియా నచ్చిందా?...ప్రమోషన్ లో '24' నిర్మాతల కొత్త స్ట్రాటజీ

కెటీఆర్ ఐడియా నచ్చిందా?...ప్రమోషన్ లో '24' నిర్మాతల కొత్త స్ట్రాటజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సినిమా నిర్మించటం ఒకెత్తు అయితే దాన్ని జనాల్లోకి తీసుకువెళ్లటానికి చేసే ప్రయత్నాలు మరొక ఎత్తు. అందులో భాగంగా సినిమా ప్రమోషన్ కోసం దర్శక,నిర్మాతలు రకరకాల స్ట్రాటజీలు ఫాలో అవుతూంటారు. తాజాగా సూర్య హీరోగా వచ్చిన 24 చిత్రం దర్శక,నిర్మాతలు తమ చిత్రం ప్రమేషన్ కోసం ఓ కొత్త ఆలోచన చేసారు.

Suriya’s 24’s Special Gift for Children—The Free Magic Watch

అయితే ఆ ఆలోచన ఇచ్చింది మన తెలంగాణా ఐటి మినిస్టర్ కెటీఆర్ కావటం విశేషం. అయితే ఆయన సరదాగా అన్నమాటను సీరియస్ గా తీసుకుని సినిమాప్రమోషన్ కు వాడుతున్నారు. ఇంతకీ కెటీఆర్ ఏమన్నారు... సూర్య ఏం స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అంటే...

Suriya’s 24’s Special Gift for Children—The Free Magic Watch

సూర్య చిత్రం 24 డిస్ట్రిబ్యూటర్స్ ...స్టూడియో గ్రీన్ కె.ఇ జ్ఞానవేల్ రాజ, ఈరోస్ ఇంటర్నేషనల్, 2డి ఎంటర్టైన్మెంట్ వారు ఓ ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చారు. అదే ...తమ సినిమా చూసిన పిల్లలకు ఓ వాచి గిప్ట్ గా ఇస్తామని. అందునిమిత్తం ఓ యాడ్ ఇచ్చారు. ఈ యాడ్ కు ఆలోచన కెటీఆర్ ఈ చిత్రం చూసి చేసిన ట్వీట్ కావటం విశేషం.

Suriya’s 24’s Special Gift for Children—The Free Magic Watch

ఈ ట్వీట్ లో కేటీఆర్...తన పిల్లలిద్దరూ ఆ వాచి కావాలని అడుగుతున్నారని అన్నారు. ఇక ఇలా వాచీలను డిస్ట్రిబ్యూట్ చేయటం ద్వారా పిల్లలను తమ సినిమాకు ఎట్రాక్ట్ చేయవచ్చనేది నిర్మాతల ఆలోచన. సమ్మర్ లో ఎలాగూ పిల్లలు ఇళ్లదగ్గరే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకు మరింతగా కలెక్షన్స్ పెరుగుతాయి. అయితే ఈ వాచిలు ఇచ్చేది ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకే సుమా.

English summary
Suriya’s “24” is about a time travel watch that can transport anyone back and forth in time to past and future. This move by the distributors of “24” will sure attract children, as they would be interested in their summer vacations to watch the movie and get gifted the watch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu