»   » తెలుగు మార్కెట్ కోసమేనా...వైజాగ్ లో స్ట్రార్ట్

తెలుగు మార్కెట్ కోసమేనా...వైజాగ్ లో స్ట్రార్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూర్య హీరోగా మొదలువుతున్న లేటెస్ట్ మూవి సింగం 3. ఈ సినిమా ఈ నెల రెండో వారంలో విశాఖపట్నంలో ప్రారంభంకానుంది. గత నెలలోనే ప్రారంభం కావల్సి ఉండగా తమిళనాడులో కురిసిన వర్షాల కారణంగా సినిమా నిర్మాణాన్ని వాయిదా వేశారు.

సూర్య సొంత బేనర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్‌, అనుష్కశెట్టి ఇందులో ప్రధాన పాత్రలు నటించనున్నారు.

ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ్‌ థ్రిల్లర్‌ ‘24' త్వరలో విడుదల కానుంది. 24 చిత్రం నిర్మాణం పూర్తి కాబోతోందని తర్వాత సింగం 3పై దృష్టి పెడతానని సూర్య మీడియాకి వెల్లడించారు. ఈ చిత్రానికి విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా సమంత, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

Suriya's 'Singam 3' to go on floors next week

ఈ రెండు చిత్రాలకు సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండు సినిమాల్లోనూ ఆడియో సూపర్ హిట్ అయింది. త్వరలో సూర్య-హరి కాంబినేషన్లో ‘సింగం-3' రాబోతోంది. అయితే ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ ను కాకుండా తమిళ యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ను తీసుకున్నారు. అయితే మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ దర్శకుడు హరి దేవిశ్రీ ప్రసాద్ తోనే సింగం 3 చిత్రానికి మ్యూజిక్ చేయించాలని డిసైడ్ అయ్యాడు.

సూర్యకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు పలకరించాయి... 'సికిందర్, రాక్షసుడు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలు కావడంతో సూర్య ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు... ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితిలోనే సూర్యకు 'సింగం' చిత్రాలతో విజయాలను అందించాడు దర్శకుడు హరి... అదే తీరున సాగుతున్న సూర్యకు 'సింగం-3' కూడా విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

English summary
“We’re start shooting from the second week of January. Now that most of the work on my other project 24 is almost over, we can totally focus on Singam 3,” Hero Surya says. To be directed by Hari, the film also features Shruti Haasan and Anushka Shetty in the lead roles.
Please Wait while comments are loading...