»   » సూర్య ’24’ ఫస్ట్ లుక్ ఇదిగో (పోస్టర్స్)

సూర్య ’24’ ఫస్ట్ లుక్ ఇదిగో (పోస్టర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేసాయి. ఆయన తాజా చిత్రం '24' ఫస్ట్ లుక్ ని మొదట ప్రకటించినట్లుగానే 24 వ తేదీన అంటే ఈ రోజు విడుదల చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమిళంలో అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ అదే స్థాయి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు చాలా సంస్థలు పెద్ద మొత్తంతో పోటీకి దిగాయి.

ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోందని సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Surya in 24 Movie First look Poster

శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ మూవీస్ ద్వారా నితిన్ '24' సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. '13బీ', ‘ఇష్క్', ‘మనం' చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ '24' సినిమాతో ఓ సైన్స్ ఫిక్షన్‌ కథ ద్వారా అందరినీ ఆశ్చర్యపరచేందుకు సిద్ధం కానున్నారట. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సూర్య సన్నాహాలు చేస్తున్నారు

సూర్య నటించిన 'సికిందర్', 'రాక్షసుడు' చిత్రాలు నిజానికి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా డైరెక్టర్ విక్రమ్ కుమార్ మీద ఉన్న నమ్మకమే నితిన్ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి కారణంగా తెలుస్తోంది

తమిళ,తెలుగు కలిపి మొత్తం ధియోటర్ బిజినెస్ 70 కోట్లు దాకా చేస్తారని భావిస్తున్నారు. ఇక తెలుగులో ఓ డబ్బింగ్ సినిమాపై ఇరవై కోట్లు పెట్టడం చాలా పెద్ద మొత్తం అంటున్నారు. అయితే హీరో సూర్యకు ఇక్కడ ఉన్న మార్కెట్ , విక్రమ్ కుమార్ కు ట్రేడ్ వర్గాల్లో ఉన్న క్రేజ్ తో బిజినెస్ బాగా జరుగుతుందని భావించే నితిన్ ఆ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.

తనకు ఇష్క్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ పై హీరో నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నట్లు ఉన్నారు. అందుకే ఆయన పోటీ పడి మరీ ...విక్రమ్ కుమార్, సూర్య కాంబినేషన్ లో రూపొందుతోన్న '24' సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఇరవై కోట్లు ఖర్చు పెట్టినట్లు తమిళ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఆంధ్రా,తెలంగాణా కు కలిపి ఈ మొత్తం వెచ్చించినట్లు చెప్తున్నారు.

English summary
24 is an upcoming Tamil Science fiction Thriller film written and directed by Vikram Kumar. The film features Suriya, Samanthaand Nithya Menen in the leading roles, and music by A. R. Rahman.
Please Wait while comments are loading...