»   » రోబోకు దీటుగా..‘గజిని’ ని మరిపించే సూర్య...!?

రోబోకు దీటుగా..‘గజిని’ ని మరిపించే సూర్య...!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'గజిని" చిత్రంతో తమిళ, తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన దర్శకుడు ఎఆర్ మురుగదాస్, సూర్యల కాంబినేషన్‌ లో తమిళంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ '7ఆమ్ ఆరివు". సూర్య కెరీర్‌ లోనే దాదాపు 85 కోట్ల భారీ బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన 'రోబో" చిత్రానికి ధీటుగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడని చ్నై సినీ వర్గాల కథనం. అంతే కాకుండా 'ఎందిరన్" ఆడియో విడుదల కార్యక్షికమాన్ని నిర్వహించిన మలేషియాలో భారీ ఎత్తున సెప్టెంబర్ 22న '7ఆమ్ ఆరివు" ఆడియో విడుదల కార్యక్షికమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 26న విడుదల కాబోతోంది.

  ఈ చిత్రంలో సూర్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. 'సూపర్ మిషన్" బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా వియత్నాంకు చెందిన జాని ట్రింజియన్ విలన్‌ గా పరిచయమవుతున్నాడు. కాగా 'గజిని" చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ పేషెంట్‌ గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్‌ గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని కోలీవుడ్ సమాచారం.

  అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూ కు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. గ్రాఫిక్స్‌ కు అత్యంత ప్రాధాన్యమున్న ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌ ని జెమ్స్ కె మెరున్ అద్భుతసృష్టి 'అవతార్", అలాగే శంకర్ దర్శకత్వం వహించిన రోబో" చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్‌ ని అందించిన స్టార్ విన్స్‌ స్టన్ స్టూడియో అందిస్తోందట. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో ' సెవెంత్ సెన్స్" అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారని, ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి. సుబ్రహ్మణ్యం తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాడని తెలుస్తోంది.

  English summary
  Surya Shruti Hasan Starer 7aam Arivu, directed by AR Murugadoss was supposed to have its audio launch by the 10th of September. But now sources reveal that the Music Release is being postponed to September 22nd and it is also said that the music launch is most likely to be done in Singapore and the live telecast is to take place in a popular TV channel.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more