»   » స్టేజిపై క్షమాపణ కోరిన హీరో సూర్య, ఇంకోసారి అలా జరగదని హామి

స్టేజిపై క్షమాపణ కోరిన హీరో సూర్య, ఇంకోసారి అలా జరగదని హామి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చైన్నై: హీరో సూర్య సాధారణంగా చాలా హంబుల్ గా ఉంటారు. ఆయనతో ఎవరికి విభేధాలు ఉండవు. అలాంటిది ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్దితి రీసెంట్ గా ఓ స్టేజిపై వచ్చింది. అదీ ఓ సీనియర్ జర్నలిస్ట్ కు. ఇంతకీ సీనియర్ జర్నలిస్ట్ కు సూర్య ఎందుకు క్షమాపణ చెప్పారు. అసలేం జరిగిందనే విషయాలు చూద్దాం.

  రీసెంట్ గా సూర్య తండ్రి శివకుమార్ 75 వ జన్మదిన వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. కొడుకులు కార్తి, సూర్యలు ఇద్దరూ ఈ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించి, తమ తండ్రికి ఆనందం కలిగించారు. ఈ సందర్బంగా శివకుమార్ గీసిన కొన్ని డ్రాయింగ్స్ ని ప్రదర్శించారు.

  సూర్య, కార్తీ ఇద్దరూ ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ క్లోజింగ్ సమయంలో సూర్య మాట్లాడారు. అంతేకాకుండా తమ కుటుంబానికి చెందిన వెల్ విషర్స్ అంతా శివ కుమార్ గురించి మాట్లాడారు. అలాగే అదే సమయంలో శివకుమార్ రోజులునాటి సీనియర్ జర్నలిస్ట్ లను కూడా ఆహ్వానించి , వారి చేత మాట్లాడింప చేసారు.

  సీనియర్ జర్నలిస్ట్ మాటలతో షాక్

  సీనియర్ జర్నలిస్ట్ మాటలతో షాక్

  స్టేజిపై సీనియర్స్ ఒక్కొక్కరే వచ్చి మాట్లాడుతూ శివకుమార్ గొప్పతనాన్ని పొగుడుతున్నారు. అలాంటి వారిలో సీనియర్ జర్నలిస్ట్, సపోర్టింగ్ నటుడు బైలవన్ రంగనాధన్ కూడా మాట్లాడారు. శివకుమార్ తో తనకున్న ఎక్సపీరియన్స్ లు చెప్పుకొచ్చారు. కానీ అదే సమయంలో ఆయన చెప్పిన ఓ మాట అందరికీ షాక్ ఇచ్చింది.

  ఆయనంత గొప్పవారు కాదు

  ఆయనంత గొప్పవారు కాదు

  శివకుమార్ గొప్పతనం, ఆయన ఎంత గౌరవనీయమైన వ్యక్తో ఆ జర్నలిస్ట్ మాట్లాడుతూ...మీడియాకు ఆయన బాగా సపోర్ట్ చేసేవారని, ఆయనంత సపోర్టివ్ వ్యక్తిని ఇండస్ట్రీలో చూడలేదని అన్నారు. ముఖ్యంగా పబ్లిక్ తో ,మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన చాలా గౌరవింగా వ్యవహించేవారని అన్నారు. కానీ ఆయన కుమారులకు అలాంటి లక్షణాలు రాలేదని అన్నారు.

  సంఘటనను గుర్తు చేసుకుంటూ

  సంఘటనను గుర్తు చేసుకుంటూ

  ఆ సీనియర్ జర్నలిస్ట్ ఓ బాధాకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు అదే స్టేజిపై. తను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానిద్దామని సూర్య ఆఫీసుకు వెళితే తనను చాలా దారుణంగా ట్రీట్ చేసారని చెప్పుకొచ్చారు. శివకుమార్ ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యలేదన్నారు.

  నేర్చుకోవాలి ఆయన్ను చూసి..

  నేర్చుకోవాలి ఆయన్ను చూసి..

  తమ తండ్రి నుంచి ఆ మంచి లక్షణాలను కొడుకులిద్దరూ నేర్చుకోవాలని ఆ సీనియర్ జర్నలిస్ట్ చురకలు అంటించారు. ఆఫీసుకు వచ్చినవారిని, ముఖ్యంగా సీనియర్స్ ని గౌరవించటం నేర్చుకోమని సూచించారు. శివకుమార్ ఎప్పుడూ అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని అని అన్నారు.

  క్షమాపణ

  క్షమాపణ

  వెంటనే సూర్య స్టేజిపైకి వచ్చి ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అలాగే ఈ విషయం తనదాకా రాలేదని అన్నారు. తనది కొత్త ఆఫీస్ అని కొత్తవాళ్లకు ఉన్నారని, ఈ సారి ఎప్పుడూ అలాంటి పొరపాట్లు జరగవని ఆయన చెప్పుకొచ్చారు. తమ తండ్రి దారిలోనే తాము నడుస్తామని సింగం స్టార్ సూర్య చెప్పుకొచ్చారు.

  భారీ అంచనాలతో..

  భారీ అంచనాలతో..

  సూర్యకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు పలకరించాయి... 'సికిందర్, రాక్షసుడు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలు కావడంతో సూర్య ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. సింగం 3 చిత్రంపై సూర్య భారీ అంచనాలు పెట్టుకున్నాడు . అదీ అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. 'సింగం' చిత్రాలతో విజయాలను అందించాడు దర్శకుడు హరి... అదే తీరున సాగుతున్న సూర్యకు 'సింగం-3' కూడా విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

  గర్జించిన సింగం

  దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ సింగం 3 మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. సూర్య గతంలో నటించిన సింగం, సింగం2 ల మాదిరే ఈ సినిమాలో కూడా తన లుక్‌తో అదరకొట్టాడు. మోషన్ పోస్టర్‌లో సూర్య పోలీస్ డ్రెస్‌లో రౌద్రంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

  అనుష్క, శృతిహాసన్

  అనుష్క, శృతిహాసన్

  తమిళ్ లో ప్రముఖ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యిన‌ట్లు చిత్ర‌బృందం తెలియ‌జేసింది. ఎక్కువ‌గా మ‌లేషియాలో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. వెంట‌నే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టేసి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

  డేట్ ఇచ్చేసారు

  డేట్ ఇచ్చేసారు

  దీపావళి కి టీజర్ ను విడుదల చేసిన యూనిట్.., నవంబర్ లో ఆడియో ని విడుదల చేసి డిసెంబర్ 16 న తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయన్నారు.

  ఓ రేంజిలో క్రేజ్ అందుకే..

  ఓ రేంజిలో క్రేజ్ అందుకే..

  ఇప్పటికే తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లతో బిజినెస్ పూర్తయిందని నిర్మాత చెప్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అనుష్క శెట్టి, శృతీహాసన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్.

  English summary
  Actor Suriya has appologised to senior actor Bayilvan Ranganathan at a function held in Chennai. The birthday of veteran actor Sivakumar was celebrated recently in a grand manner. After having an event to exhibit his art works, the function concluded with media folks taking the diaz to talk in praise about Sivakumar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more