»   » అమితాబ్, మోహన్ లాల్ సినిమాలో గజిని సూర్య కమ్యాండో గా!

అమితాబ్, మోహన్ లాల్ సినిమాలో గజిని సూర్య కమ్యాండో గా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాక్షన్ అడ్వెంచర్ తరహా చిత్రాలు తీయడంలో అందెవేసిన చెయ్యి మలయాళ దర్శకుడు మేజర్ రవి. ఎందుకంటే గతంలో ఈయన రూపొందించిన చిత్రాలు 'మిషన్ 90 డేస్", 'కురుక్షేత్రా", 'కీర్తిచక్ర " లాంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే. మరి ఇలాంటి దర్శకుడు చిత్రంలో అమితాబ్ బచ్చన్, గజిని సూర్య, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ ముగ్గరూ ఒకే చిత్రంలో నటించడం సినీ అభిమానులకు ఒక వరం. ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ నటించే చిత్రం 'కాందహార్" త్వరలో తెరకెక్కబోతోంది. సైన్యం యుద్దం ప్రధానాంశాలతో రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలు తీయడంలో ఆసక్తి కలిగిన మలయాళ దర్శకుడు మేజర్ రవి దీన్ని తెరకెక్కించబోతున్నారు.

1999లో దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కాందహార్ ఎరోప్లేన్ హైజాక్ సంఘటన ఆధారంగా బ్యాక్ డ్రాప్ తో కథ నడుస్తుంది. ఇందులో మోహన్ లాల్ తో నటించడానికి తమిళ నటుడు సూర్య, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంగీకరించారని దర్శకుడు మేజర్ రవి తెలిపారు. మూడు, నాలుగు నెలల్లో షూటింగ్ ప్రారంభమవ్వబోయే ఈ చిత్రంలో నటుడు గజని సూర్య ఓ కమ్యాండో పాత్రలో కనిపించబోతున్నారు. ఎరోప్లేన్ గురైన పిల్లల తండ్రి పాత్రలో అమితాబ్ కనిపించబోతున్నారు. అమితాబ్ కేరళ వచ్చినప్పుడు దర్శకుడు కథను వినిపించడంతో అమితాబ్ అంగీకరించడం అది కూడా తమిళ, మలయాళ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu