»   » నా కూతురు ని తలచుకుంటేనే భయమేస్తోంది: సూర్య

నా కూతురు ని తలచుకుంటేనే భయమేస్తోంది: సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'భవిష్యత్తు సమాజంలో నా కుమార్తెను వూహిస్తేనే భయమేస్తోంద'ని తమిళ స్టార్‌ హీరో సూర్య ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా తమిళంలో తెరకెక్కిన 'మాలిని 22 పాలయం' చిత్ర ఆడియో వేడుకలో ఆయన పాల్గొన్నారు.

ప్రస్తుత నేరాలను ప్రస్తావిస్తూ... భవిష్యత్తులో తన కుమార్తె పరిస్థితిని సమాజపరంగా ఊహిస్తేనే శరీరం భయంతో కంపించిపోతోందన్నారు. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా మున్ముందు ఈ ప్రభావం మరెంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో చూపించిన విషయాలు సమాజంలోని నిజ దృశ్యాలుగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక 'మాలిని 22 పాలయం' చిత్రానికి నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళంలోనూ విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేయనున్నారు. ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని తెలుస్తోంది. 2012లో మళయాలంలో వచ్చిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రానికి ఇది రీమేక్.


ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.

English summary
Actor Suriya saying that with the present state of affairs in the country he fears for his own daughter’s future and safety. He also went on to point out that a leading U.S magazine had warned people from going to India and said that there was a ‘rape festival’ going on he 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu