»   » 'రక్త చరిత్ర-2' హీరో సూర్య కు గాయాలు..మూడు రోజుల రెస్ట్

'రక్త చరిత్ర-2' హీరో సూర్య కు గాయాలు..మూడు రోజుల రెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజు విడుదల అవుతున్న"రక్త చరిత్ర-2" లో ప్రధాన పాత్ర పోషించిన సూర్యకి తాజాగా గాయాలయ్యాయి. మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న '7 ఓం అరివు' చిత్రం షూటింగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బిన్నీ మిల్స్ వద్ద ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తూ...సూర్యకి బదులుగా డూప్ ని పెట్టి తీద్దామని చెప్పారు. అయితే సహజత్వం కోసమని సూర్య రిస్క్ చేసి ఈ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. అయితే బ్యాలన్స్ తప్పి పడటంతో చీల మండలం దగ్గర దెబ్బతగిలింది. వెంటనే హాస్పటిల్ కి తీసుకెళ్ళటంతో చెకప్ చేసి మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఇక '7 ఓం అరివు' చిత్రం కథ సర్కస్ నేపధ్యంలో జరగనుంది. ఈ చిత్రంలో సూర్య సర్కస్‌ కళాకారుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు.

ఈ పాత్ర కోసం సూర్య కొందరు సర్కస్‌ కళాకారులతో మాట్లాడినట్లు తెలిసింది. కోయంబత్తూర్ లోని గ్రేట్ ముంబై సర్కస్ లో ఈ చిత్రం షూటింగ్ కొంతకాలం జరుగింది. అలాగే మరి కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల కోసం చైనా వెళ్ళనున్నారని తెలుస్తోంది. రెడ్‌ జెయింట్‌ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు. ఇక శృతి హాసన్ తెలుగులో కూడా సిద్దార్ధ సరసన రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ దర్శకత్వంలో నటించింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu