For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీ తర్వాత ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే సౌత్ హీరో

  By Srikanya
  |

  చెన్నై : తెలుగు,తమిళ భాషల్లో రజనీకాంత్ ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరో అనే సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే సౌత్ హీరో ఎవరంటే తమిళ హీరో సూర్య అని తేల్చి చెప్తున్నారు. ఆయన తన తాజా చిత్రం బ్రదర్స్ కి 27 కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆ సొమ్ముని క్యాష్ గా 12 కోట్లు,తెలుగు రైట్స్ రూపంలో మరో 15కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో మేజర్ షేర్ రైట్స్ ఆయన తీసుకున్నారు. మొత్తం 17కోట్లుకి తెలుగుకి వెళితే అందులో 15కోట్లు ఆయన వాటా అని తెలుస్తోంది. దాంతో సూర్యనే రజనీకాంత్ తర్వాత ఎక్కువ తీసుకునే హీరో గా చెప్తున్నారు.

  సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్. ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ కి 'డూప్లికేట్‌' అనే పేరును ఖరారు చేశారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా టైటిల్ ని మార్చి బ్రదర్శ్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. అవిభక్త కవలల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రదర్శ్ అనే టైటిల్ పెడితేనే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 12న ఈ చిత్రం విడదల అయ్యే అవకాసం ఉంది.

  ఇక తొలిసారిగా సూర్య తన వాయిస్ ని తెలుగువారికి వినపించనున్నారు. తనే తన పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు. కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు.

  మాట్రాన్, ఎమ్జీఆర్ చిత్రంలా అన్ని వర్గాల వారిని అలరించేలా ఉంటుందని ఆ చిత్ర హీరో సూర్య వెల్లడించారు. ఈయన అవిభక్త కవలలుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం మాట్రాన్. ర్య మాట్లాడుతూ...మాట్రాన్‌లో ప్రతి సన్నివేశంలో నటించ డం సరికొత్త అనుభవమే. నేను నటుడిగా రంగప్రవేశం చేసి 13 ఏళ్లు అయ్యింది. ఇప్పటివరకు మాట్రాన్ చిత్రం లో పాత్రల తరహాలో నటించలేదు. ఇందులో కవలలుగా విరుద్ధ భావాలున్న పాత్రలు పోషించాను. ఒక పాత్ర పేరు అఖిళన్, మరో పాత్ర పేరు విమలన్. ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. అయితే ఇద్దరూ హీరోలే. రెండు పాత్రల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇక ఇందులో దర్శకుడి పని తీరు అద్భుతం. మాట్రాన్ చిత్రం కోసం కెవి ఆనంద్ ఎంతగా శ్రమించారో నాకు తెలుసు.

  ర్శకుడు కె.వి.ఆనంద్ మాట్లాడుతూ థాయిలాండ్‌కు చెందిన అవిభక్త కవలలను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం మాట్రాన్ అని తెలిపారు. ఈ కవలలు అమెరికా వెళ్లి ఒక సర్కస్ కంపెనీ ప్రారంభించి బాగా ఉన్నత స్థితికి చేరుకున్నారని శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఫ్లైట్‌లో పయనిస్తుండగా ఒక మ్యాగజైన్‌లో చదివానన్నారు. అప్పుడే దీన్ని ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేద్దామని సూర్యతో చెప్పానన్నారు. ఆ విధంగా మాట్రాన్ తెరకెక్కిందని వివరించారు. ఒక పాట మినహా చిత్రం పూర్తి అయ్యిందని చెప్పారు. డబ్బింగ్ కూడా పూర్తి అయ్యిందని, ప్రస్తుతం గ్రాఫిక్స్ జరుగుతున్నాయని తెలిపారు.

  English summary
  Tamil star Suriya is now the highest paid Young Hero in South as he is getting paid Rs 12 crore outright salary and also a major share in Telugu theatrical rights. For the film Brothers (Maattrraan in Tamil), the actor received Rs 27 crore as remuneration which include Rs 12 outright pay package and another Rs 15 crore out of the Rs 17 crore (Telugu rights).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X