For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'స్కానింగు' లతో టెన్షన్ పడుతున్న హీరో సూర్య!

  By Srikanya
  |
  చెన్నై : రీసెంట్ గా అవిభక్త కవలలుగా సూర్య తాజాగా నటించిన చిత్రం 'బ్రదర్శ్ ‌'. కేవీ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇందులో సూర్య అఖిలన్‌, విమలన్‌ పాత్రలు పోషించారు. వాస్తవానికి అఖిలన్‌ పాత్ర మాత్రమే సూర్య పోషించాడు. విమలన్‌ పాత్రలో వేరే వ్యక్తి నటించాడు. అయితే ఆ తర్వాత బ్లూమెట్‌ సాంకేతికతతో విమలన్‌ పాత్రలో సూర్య నటించి.. అసలైన సినిమాలో కలిపారు. అలా వాస్తవికత ఉట్టిపడేలా చేశారు. ఆ పాత్ర కోసం సూర్య చాలా కసరత్తు చేసారు. అదే ఆయన్ని టెన్షన్ లో పడేసిందని సమాచారం.

  'అవతార్‌' చిత్రంలో జేమ్స్‌ కామరూన్‌ వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని 'బ్రదర్శ్ ‌'లో వాడారు. 'లైటింగ్‌ ఫాల్‌'గా పేర్కొనే 360 డిగ్రీల కోణంలో కెమెరాలు, ప్రత్యేక లైటింగ్‌ ఎఫెక్ట్స్‌లు వినియోగించారు. వీటి నడుమ సూర్య నిల్చుని పలురకాల హావభావాలు పలికించగా.. ఆ కెమెరాలు, సాంకేతికతో స్కాన్‌ చేశారు. దీంతో ఓ యానిమేషన్‌ చిత్రాన్ని సులువుగా తెరకెక్కించొచ్చు. అంతేకాకుండా.. ఆయన కాల్షీట్‌ లేకుండానే ఓ చిత్రాన్ని రూపొందించి కూడా విడుదల చేయొచ్చు. ఈ విషయం మొదట సూర్య పట్టించుకోలేదు. కానీ ఇలా చేయవచ్చనే విషయం రీసెంట్ గా సూర్య కు తెలిసింది.

  దాంతో ఇలా వెసులుబాటు కలిగి ఉన్న స్కానింగులు ఇతరుల చేతికి చేరకుండా సూర్య చర్యలు ప్రారంభించారు. స్కానింగులు, సాఫ్ట్‌వేర్లు ఆయన ఆ సంస్ధలను అడుగుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అమెరికాలోని ఓ స్టూడియోలో ప్రస్తుతం ఈ స్కానింగ్‌ రికవరీ పనులు జరుగుతున్నట్లు కోడంబాక్కంలో వార్తలు వినిపిస్తున్నాయి. మరో ప్రక్క శశికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సూర్యను ఎంపిక చేశారు.

  ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'సెవెన్త్ సెన్స్ 'లో వైవిధ్య పాత్రలో అలరించిన సూర్య ఇటీవల విడుదలైన 'బ్రదర్శ్ ‌'లోనూ అవిభక్త కవలలుగా అద్భుత నటన ప్రదర్శించారు. విమర్శకులు ప్రశంసలు అందుకుంటూనే కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా వూపాడు. దర్శకుడు శశికుమార్‌ వెండితెరపైనా సత్తా చాటుతున్నాడు. ఇటీవల 'సుందరపాండియన్‌'తో హీరోగా మరో హిట్‌ అందుకున్నాడు. ఆయన సూర్యతో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. సూర్య ప్రస్తుతం 'సింగం-2' చిత్రీకరణలో తీరికలేకుండా ఉన్నాడు. ఆపై గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో 'తుప్పరియుం ఆనందన్‌' చేయనున్నాడు. ఈ రెండింటి తర్వాత సూర్య-శశికుమార్‌ కాంబినేషన్‌లోని సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

  English summary
  KV Anand is worked hard to make his venture Brothers a bigger one. The director had planned to make it bigger by roping in one of the legendary and Top most Visual effects from Hollywood. Stan Winston Studios are the one who worked for the epic films like Avatar, Jurassic Park series, Terminator Series, Aliens, Predator, End of Days, Iron Man, War of the Worlds and many more high budget movies of Hollywood.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more