కథ సూర్యకు తగ్గట్టు గౌతమ్‌మీనన్ మార్చడంతో...
గజిని, యముడు చిత్రాల ఫేమ్ హీరో సూర్య కొత్త చిత్రం ధృవనక్షత్రం షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. గజిని, ఏంమాయచేశావో తదితర సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమేకాకుండా, స్వయంగా నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ తరహాకి చెందిన ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు గజిని, కాక్క కాక్క(తెలుగులో ఘర్షణ), వారణం ఆయిరమ్ అనే మూడు చిత్రాలు వచ్చాయి. తమిళంలో ఈ మూడూ సూపర్‌హిట్టే.
గౌతమ్‌మీనన్ మాట్లాడుతూ.. సూర్య 'ధ్రువ్' అనే పాత్రలో నటిస్తున్నారు. కథకు నప్పుతుందనే ఉద్దేశంతో చిత్రానికి 'ధ్రువనక్షత్రం' అనే పేరుపెట్టాం. నా గత రెండు చిత్రాల్లో కనిపించిన సూర్యలా కాకుండా కొత్తగా చూడొచ్చని చెప్పారు. పార్తిబన్, సిమ్రాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. 20 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.
'ధ్రువనక్షత్రం' టైటిల్ తో గతంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెలుగులో వచ్చింది. 1989 లో ఆ చిత్రం వచ్చింది. మాఫియా నేపధ్యంలో ఆ చిత్రం రూపొందింది. ఇక ఈ కొత్త చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉండటం, గౌతమ్ మీనన్ చిత్రాలకు సైతం తెలుగులో బిజినెస్ ఉండటం కలిసి వచ్చే అంశం.
నాగచైతన్యతో... ' ఏమి మాయ చేసావే ' చిత్రంతో తెలుగువారికి పరిచయమైన దర్శకుడు స్టార్ డైరక్టర్ గౌతమ్ మీనన్. ఆ తర్వాత ఆయన తమిళంలో చేసిన చిత్రాలుకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆయన మరో చిత్రం కమిటయ్యారుయ. గతంలో 'కాక్క కాక్క'(తెలుగు ఘర్షణ) తో సూర్య కి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఆయన మరోసారి సూర్యతో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications












