»   » అన్నతో ష్యూర్ గా హిట్ కొడతానంటున్నాడు

అన్నతో ష్యూర్ గా హిట్ కొడతానంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్'. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సూర్య తొలిసారిగా నటిస్తూండటంతో మంచి అంచనాలే ఉన్నాయి. సూర్య తమ్ముడు కార్తి, వెంకట్‌ప్రభు కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'బిరియాని' చిత్రం ఒకింత ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇప్పుడు అన్ని సెంటర్ల ప్రేక్షకులకు 'మాస్‌' విందుకు అందించేందుకు సూర్య, వెంకట్‌ప్రభు సిద్ధమవుతున్నారు.యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పాటలు రానున్న ఎనిమిదో తేదీన విడుదల కానున్నాయి.

ఈ కార్యక్రమానికి చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా 'ఆదవన్‌' తర్వాత సూర్య, నయనతార కలసి నటిస్తున్న చిత్రమిది. ప్రణీత రెండో హీరోయిన్ గా నటించారు. మదన్‌కార్కి మాటలు రాశారు. ప్రేమ్‌జీ, పార్థిబన్‌, సముద్రకని తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదలైన తర్వాత జ్యోతిక నటించిన '36 వయదినిలే' సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Surya's Mass Movie Audio Release date

ఈ చిత్రానికి సంబంధించిన అపీషియల్ టీజర్ విడుదలైంది. టీజర్ సూపర్బ్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మే 15న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదో డిఫరెంట్ జోజర్ సినిమా.


ఈ సినిమాలో సూర్య సరసన నయనతార, ప్రణిత హీరోయిన్లు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


ఇందులో సూర్యది డబుల్ రోల్. ఇందులో సూర్య ఒక పాత్రలో హీరో క్యారెక్టర్, మరొకటి నెగిటివ్ రోల్ చేసాడని ప్రచారం సాగుతోంది. తాజాగా విడుదలై టీజర్ చూస్తే కూడా ఇదే విషయం స్పష్టం అవుతోంది. సూర్య ఈ సినిమాలో దెయ్యం లేదా, నెగిటివ్ ఫోర్స్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే విధంగా ఉంటాయిని టీజర్ స్పష్టం చేస్తోంది.


ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నయనతార నటిస్తుండటం మరో హైలెట్. గతంలో ఎక్స్ పిచ్చి వై పిచ్చి అంటూ 'గజిని'లో గ్లామర్ ను పంచిన నయన్ 'ఘటికుడు' మూవీలోనూ సూర్య సరసన నటించింది. ముచ్చటగా మూడోసారి సూర్యతో రొమాన్స్ చేస్తోంది.

English summary
Surya's latest movie audio will be releasing on 8th of this month. Masss movie was colorful and the pin telling it was going to pin everyone with thrilling scenes. Masss movie was expected to release for the summer season.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu