»   » నాగ్ సూపర్ హిట్ టైటిల్ తో సూర్య చిత్రం

నాగ్ సూపర్ హిట్ టైటిల్ తో సూర్య చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తెలుగు హిట్టైన టైటిల్స్ కి ఇప్పుడు తమిళనాట మంచి డిమాండ్ ఉంది. కత్తి చిత్రంతో ఓ చిత్రం ఓ ప్రక్కన నిర్మాణం జరుగుతూండగా, మరోప్రక్క నాగార్జున సూపర్ హిట్ చిత్రం మాస్ టైటిల్ తో మరో చిత్రం మొదలైంది. తమిళ, తెలుగు భాషల హీరో సూర్య కొత్త చిత్రానికి ఈ టైటిల్ పెట్టారు. అయితే ఈ రెండు చిత్రాలకు తెలుగులో ఏ టైటిల్ పెడతారో చూడాలి అంటున్నారు సినిమా జనం. ఎందుకంటే కత్తి అని పెట్టినా మాస్ అని తెలుగులో పెట్టినా కల్యాణ్ రామ్, నాగార్జున చిత్రాలే గుర్తుకు రావటం ఖాయం.

అజిత్‌, విజయ్‌ల తర్వాత వేగంగా పేరు తెచ్చుకుంటున్న నటుడు సూర్య. వైవిధ్య నటనతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినీజనాలకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన లింగుస్వామి దర్శకత్వంలో నటించిన 'అంజాన్‌' నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఎప్పటినుంచో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడా ప్రాజెక్టు మొదలైంది.

Surya's next film titled as Mass

'మంగాత్తా', 'బిరియాని' విజయాలతో హవా చాటుకుంటున్న వెంకట్‌ప్రభు తాజాగా సూర్యతో మాస్‌మసాలా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు 'మాస్‌' అని పేరు కూడా పెట్టారు. స్టూడియో గ్రీన్‌ బ్యానరుపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది.

Surya's next film titled as Mass

సూర్యకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌ప్రభు, జ్ఞానవేల్‌రాజా, ఆర్‌డీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇందులో సూర్యకు జంటగా నయనతార, ఎమీజాక్సన్‌ నటిస్తున్నారు. ఎప్పటిలాగే వెంకట్‌ప్రభు తమ్ముడు ప్రేమ్‌జీ ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

English summary

 Next to Anjaan ,Surya signed up his new project with director Venkat prabhu . The film is titled as “Mass” as per the director’s tweet on twitter.Nayanthara plays female lead role opposite to actor surya. The shooting will be started by the end of this month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu