»   » 'ది అన్‌బ్రేకబుల్‌' గా హీరో సూర్య

'ది అన్‌బ్రేకబుల్‌' గా హీరో సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
Surya
చెన్నై : తమిళ స్టార్‌ హీరో సూర్య తెలుగు, మలయాళం తర్వాత ఇప్పుడు హిందీపై కన్నేశారు. ఇందులో భాగంగా తన 'బ్రదర్స్‌' ('మాట్రాన్‌') ను డబ్బింగ్‌ రూపంలో బాలీవుడ్‌కి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని 'ది అన్‌బ్రేకబుల్‌'('No 1, Judwa, the unbreakable') పేరుతో త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇది సాధించే ఫలితం ఆధారంగా హిందీలో నటించటంపై సూర్య ఓ నిర్ణయానికి రానున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వాస్తవానికి కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ చిత్రం పరాజయాన్నే చవిచూసింది. 'గజిని', 'సింగం' హిందీ రీమేక్‌లు విజయం సాధించిన నేపథ్యంలో బాలీవుడ్‌లో ఓ నేరు చిత్రం ద్వారా మెరవాలనే ఆలోచనకు వచ్చారట సూర్య. ముందస్తు ప్రయత్నంగా 'బ్రదర్స్‌'తో సిద్ధమయ్యారట. గతంలో వర్మ దర్శకత్వంలో రూపొందిన రక్త చరిత్ర ద్వారా బాలీవుడ్ కు వచ్చారు. కానీ సినిమా పరాజయం పొందటంతో అక్కడ ఎంట్రీ ఇచ్చి తదుపరి ఆఫర్స్ పట్టలేకపోయారు.


తమిళంలో అగ్రహీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్య. తెలుగులోనూ స్థిరమైన మార్కెట్‌ దక్కించుకున్నారు. తాజా సూపర్‌హిట్‌ 'సింగం-2'తో మలయాళంలోనూ పాగా వేశారు. ఈ చిత్రం కేరళలోనూ సూపర్‌హిట్‌ అయింది. అక్కడి ప్రేక్షకుల్లో సూర్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆయన 'మాట్రాన్‌' ద్వారా హిందీ ప్రేక్షకులను కూడా పలకరించనున్నారు.

ఇక 'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్‌ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్‌ డ్రాగన్‌ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

English summary

 
 Maattrraan directed by K V Anand dealt about conjoined twins which had many innovative factors about it. Suriya’s performance was much talked about and his hard work in the film was the major highlight. Now, Maattrraan goes to Hindi, dubbed as ‘No 1, Judwa, the unbreakable’ and the trailer of the same was released yesterday, 13th December 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu