»   » చూడని అవతారం చూపించే సూర్య ‘సెవన్త్‌ సెన్స్‌’‌...!

చూడని అవతారం చూపించే సూర్య ‘సెవన్త్‌ సెన్స్‌’‌...!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సూర్య కథానాయకుడిగా నటించిన సినిమా 'సెవెంత్‌ సెన్స్‌". 'చూడని అవతారం" అనేది ఉపశీర్షిక. శృతిహాసన్‌ కథానాయిక. మురుగదాస్‌ దర్శకుడు. తమిళమాతృక పేరు 'ఏళాయుం ఆరివు". లక్ష్మిగణపతి ఫిలింస్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం బి రూపేష్‌ వై ఈ చిత్రాన్ని తెలుగులో సగర్వంగా అందిస్తున్నారు. హారిస్‌ జైరాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు మార్కెట్లో పెద్ద హిట్టయి సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుంటోంది. గజని ఫేం దర్శకుడు మురుగదాస ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొంది. సూర్య తొలిసారిగా హిస్టారికల్‌ మెడికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. సర్కస్‌ వాలాగా, ఫైటర్‌ గా, లవర్‌ బోయ్‌ గా 3విభిన్న పాత్రల్లో సరికొత్త అవతారాలతో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. శృతిహాసన్‌ అందాలు యువతరాన్ని అలరిస్తాయి.

  కాగా దసరా సీజన్ దూకుడు, ఊసరవెల్లి హడావిడి తర్వాత ఇప్పుడు అందరి చూపు సూర్య-మురుగదాస్ సినిమా 'సెవెన్త్ సెన్స్" పైనే వుంది. 26న దీపావళి కానుకగా రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో చాలా హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. సాధారణంగా సినిమా స్టిల్స్, ట్రైలర్స్ చూసిన తర్వాత ఇదీ స్టోరీ అని అంచనా వేసే సినీ పండితులు సైతం ఇప్పుడు సెవెన్స్ సెన్స్ స్టోరీ ఎలా వుంటుంది అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సూర్య పెర్ ఫార్మెన్స్ , మురగదాస్ టేకింగ్ హైలైట్ గా నిలిచే సెవెన్త్ సెన్స్ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ మూవీగా చెప్పుకునే రీతిలో వుంటుందని మురగదాస్ చెప్తున్నాడు.

  ఇదిలా వుంటే తమిళనాడులో దీపావళికి రిలీజ్ అయ్యే సినిమాల మధ్య విపరీతమైన పోటీ వుంటుంది. ఈ దీపావళికి సూర్య సినిమా రిలీజ్ అవుతుండగా, మరో టాప్ హీరో విజయ్ నటించిన 'వేలాయుథం" కూడా విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలపైన తమిళనాడులో చాలా హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. దీపావళి రేస్ లో ఈ ఇద్దరి లో ఎరు విన్ అవుతార్ చూడాల్సిందే...

  English summary
  One can live peacefully as long as he doesn’t know his future. But at times, the sixth sense will make us predict about what’s going to happen tomorrow and allow us to go forward. This is exactly what Murugadoss is going to showcase in his latest flick ‘Seventh Sense’.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more