»   » 'రక్త చరిత్ర' ఫలితం చేదుగానే ఉంది...హీరో సూర్య

'రక్త చరిత్ర' ఫలితం చేదుగానే ఉంది...హీరో సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తమిళ హీరో సూర్య నటించిన 'రక్త చరిత్ర' సీక్వెల్ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళుగా ఆ విషయం గురించి ప్రస్దావించటానికి ఇష్టపడని సూర్య రీసెంట్ గా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ చిత్రం ప్రస్దావన తెచ్చి...'రక్త చరిత్ర' రాంగ్‌ ఛాయిస్‌గా భావించటం లేదు. నా క్యారెక్టర్‌ తీర్చిన తీరు నన్ను బాగా ఇంప్రెస్‌ చేసింది. ఈ సినిమా చేసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ ఫలితం చేదుగానే ఉంది. కానీ పూర్తి సంతృప్తినిచ్చిన పాత్ర అన్నారు. అలాగే రక్త చరిత్ర ఏ భాషలో చేయడానికైనా ఇష్టపడేవాణ్ని. ఆ చిత్రంతో హిందీలో పరిచయటం కావటం చాలా ఆనందంగా ఉంది. ఫలితం ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తిని కాదు. అదొక్కటే పరిగణలోకి తీసుకోను. తమిళంలో నా సినిమాలు బాగానే ఆడుతున్నాయి. భిన్నమైన పాత్రలు వేసినప్పుడల్లా నన్ను బాగానే రిసీవ్‌ చేసుకున్నారు. ఏదో కిందపడిపోయానన్న ఫీలింగ్‌ ఏదీ లేదు అన్నారు.

English summary
Tamil star Surya, who made his Bollywood debut with Ram Gopal Varma's 'Rakta Charitra', says his launch into the Hindi film industry was not a planned one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu