»   » ఫెయిలైన స్టూడెంట్స్ కి ధైర్యం చెప్తు్న్నాడు

ఫెయిలైన స్టూడెంట్స్ కి ధైర్యం చెప్తు్న్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : పరీక్షల్లో విఫలమైన వారు నిరుత్సాహానికి గురవ్వడం తగదని నటుడు సూర్య పేర్కొన్నారు. ఆయన ఈ విషయమై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మార్కుల ఆధారంగా విజయం సాధిస్తారనేది సరికాదన్నారు. గెలుపోటములను నిర్ణయించేది అవే కాదని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందాలన్నదే తన కోరికని తెలిపారు. సూర్య 'అగరం' పేరిట విద్యా ఛారిటబుల్‌ ట్రస్టు నిర్వహిస్తూ ఏటా ర్యాంకర్లకు, పేద విద్యార్థులకు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సూర్య తాజా చిత్రం రాక్షసుడు గురించి...

సూర్య హీరో గా నటిస్తున్న తమిళ చిత్రం మాస్. వెంకట్ ప్రభు దర్శకుడు. నయనతార, ప్రణీత కథానాయికలు. ఇదే చిత్రాన్ని రాక్షసుడు పేరుతో మేధా క్రియేషన్స్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌ను రీసెంట్ గా హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది.

Surya volunteers to help +2 students

రచయిత శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ.... రాక్షసుడు టైటిల్ అందరికి సుపరిచితమే. ఈ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూశాక అర్థమవుతుంది. సినిమాలో హారర్, కామెడీ, హ్యూమర్ ఇలా అన్నీ వున్నాయి. సినిమా ప్రేక్షకులకు మాస్ ట్రీట్ అవుతుంది. 2005లో మన్మథ సినిమాతో అనువాద రచయితగా కెరీర్ ప్రారంభించాను.ఈ సినిమాతో 200 చిత్రాలు పూర్తి చేసుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.... రవితేజ,సూర్య, జ్ఞానవేల్‌రాజా కలయికలో ఓ సినిమా తెరకెక్కించాలనుకున్నాను. కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. రాక్షసుడు ఇదొక కొత్త సినిమా. చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి సరికొత్త అనుభూతి కలుగుతుంది. కోదండరామిరెడ్డి వంటి గొప్ప వ్యక్తి రూపొందించిన సినిమా టైటిల్‌ని మా సినిమాకు పెట్టుకోవడం ఆనందంగా వుంది. నయనతార, ప్రణీత ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అని తెలిపారు.

సూర్య మాట్లాడుతూ ....సింగం,బ్రదర్స్ చిత్రాల తరువాత ఈ సంస్థలో చేస్తున్న మూడవ సినిమా ఇది. వెంకట్‌ప్రభు లేకపోతే ఈ సినిమా చేయలేం. ముందు ఓ లవ్‌స్టోరీ చేయాలనుకున్నాం. దానికి కొన్ని వినూత్నమైన అంశాల్ని మేళవించి ఈ సినిమాను రూపొందించారు. సరికొత్త పంథాలో సినిమా వుంటుంది. యువన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. ఇప్పటి వరకు నటుడిగా పనిచేస్తున్న నేను నా సొంత నిర్మాణ సంస్థలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. హౌఓల్డ్ ఆర్ యు చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న 36 వయదినిలే చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేస్తున్నాం అన్నారు.

కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.... సినిమాలో ఫైట్స్ సరికొత్తగా వుంటాయి. వెంకట్‌ప్రభుతో చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 29న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

English summary
To help the under privileged students actor Suriya has volunteered to help deserving students for higher studies with money and other needs. The gem of an actor Suriya runs Agaram Foundation an organization working for the under-privileged to assist them attaining their right to knowledge and right to education.
Please Wait while comments are loading...