Just In
- 9 min ago
అప్పుడే బిజినెస్ మొదలు పెట్టిన RRR నిర్మాత.. షాక్ ఇస్తున్న ఓవర్సీస్ రైట్స్
- 40 min ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్
- 57 min ago
గణతంత్ర దినోత్సవ వేడుకలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్, చెర్రీ సందడి
- 1 hr ago
చాలా కాలం తరువాత పవన్‌తో త్రివిక్రమ్.. చాయ్ గ్లాసుతోనే మొదలు పెట్టారు
Don't Miss!
- News
కేటీఆర్ సీఎం అయితే కవిత, హరీష్ లకు సమస్య , రసమయిని సీఎం చెయ్ : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
- Sports
సైనీ గాయం గురించి మర్చిపోయా.. మూడో పరుగు కోసం రమ్మన్నాను! అంతలోనే: పంత్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్తవారితో లోబడ్జెట్ లో చేస్తానంటున్న స్టార్
చెన్నై : స్టార్ హీరో సూర్య కొత్త చిత్రం 'సింగం-2' ఇటీవలే విడుదలైన మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే ఆయన కొత్త అవతారమెత్తాడు. తన కుమార్తె దియా, కుమారుడు దేవ్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు. వారి పేర్లలోని తొలి అక్షరాలు 'డి' కావటంతో '2డీ ఎంటర్‌టైన్‌మెంట్' అన్న పేరు పెట్టాడు.
సూర్య మాట్లాడుతూ.. ఎన్నో మంచి కథలు వింటున్నా అన్నింటినీ చేయలేకపోతున్నానని, అలాంటి వాటిలో నటించలేకపోయినా కనీసం నిర్మించాలన్న ఉద్దేశంతోనే దీన్ని స్థాపించానన్నారు. ప్రస్తుతానికి కొత్తవారితో లోబడ్జెట్ సినిమాలు నిర్మిస్తానని, తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు కూడా అందిస్తామని వివరించాడు.
అలాగే ''నటుడిగా ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే. దర్శకుడు గౌతమ్ మీనన్‌తో కలిస్తే ప్రయోగం తప్పనిసరి. గతంలో మేమిద్దరం రెండు చిత్రాలు చేశాం. ఇప్పుడు మూడో చిత్రంగా 'ధ్రువనక్షత్రం' చేస్తాం. అందులోనూ కొత్తగా కనిపిస్తాను. ఆ వివరాలు త్వరలోనే తెలుస్తాయి. నాన్నగారు 'సింధు భైరవి' లాంటి సంగీత ప్రధాన చిత్రాల్లో నటించారు. నాకూ అలాంటి సినిమాలు చేయాలని ఉంది. ఎందుకంటే సినీ జీవితంలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. అవకాశం వస్తే అలాంటి పాత్రలు చేసేందుకు సిద్ధం. నాకు నేరుగా తెలుగు సినిమాలో చేయాలని ఉంది. అయితే అందుకు తెలుగు, తమిళ పరిశ్రమల్లో గుర్తింపు ఉన్న దర్శకుడు అయితే మంచిది. ఇప్పటికే చాలా మంది దర్శకులతో చర్చిస్తున్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కుతుంది.'' అని చెప్పారు.
ఇక ''ఇంతకు ముందు వచ్చిన 'యముడు', ఇప్పుడు విడుదలైన 'సింగం' సినిమాల్లో ఏది బాగుంది అంటే నేను చెప్పలేను. మీరు చిన్నప్పుడు అందంగా ఉన్నారా.. పెద్దయ్యాక బాగున్నారా అంటే చెప్పగలరా.. ఇదీ అంతే. యముడులో నరసింహం ఓ ఎస్సైగా జీవితం మొదలుపెడతాడు.. ఆ తర్వాత ఉన్నత స్థానాలకు చేరతాడు. అందులో కేవలం రాష్ట్రంలో జరిగే ఘటనలను అడ్డుకుంటాడు. 'సింగం'లో మన దేశంలో జరిగే విదేశీ మాఫియా కార్యకలాపాల్ని అడ్డుకుంటాడు. ఏ సినిమాకి ఆ సినిమానే బాగున్నాయి. రెండింటిలోనూ వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి'' అన్నారు.