»   » అందుకే రంజితని మణిరత్న తీసేసారు

అందుకే రంజితని మణిరత్న తీసేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం తాజాగా రూపొందిస్తున్న 'రావణ్‌' లో రంజితది కీలక పాత్ర..ఇప్పటికే ఆమె చాలా సన్నివేశాల్లో ఈమె నటించింది. అయితే ఇప్పుడామె సీన్ లో లేదు. ఆమె స్థానంలో మరో నటిని ఎంపిక చేసారని సమాచారం. గతంలో రంజితతో చిత్రీకరించిన సన్నివేశాల్ని మళ్లీ కొత్త నటితో తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆమెని తప్పించటానికి కారణంగా గత రెండు వారాలుగా ఈమె ఆచూకీ లేకపోవడమే నని చెప్తున్నారు. కానీ మణిరత్నం 'రావణ్‌' నుంచి ఆమెని తప్పించటానికి కారణం తమ చిత్రంపై బ్యాడ్ ఇన్ఫూయిన్స్ పడకుండా ఉండటమే అసలు ఉద్దేశ్యమని తెలుస్తోంది. ఎందుకంటే రేపు కీలక పాత్ర చేస్తున్న ఆమెని పబ్లిసిటీ చేసేటప్పుడు గానీ, రిలీజయ్యాక గానీ నిత్యానంద స్వామితో బయిటపడ్డ సెక్స్ వీడియో ప్రస్తావన వస్తుందని, అలా తమ చిత్రం సంభంధం లేకుండా అప్రదిష్ట పాలు కాకూడదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని తమిళ పరిశ్రమలో వినపడుతోంది. ఇక ఈ 'రావణ్‌' చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌, విక్రమ్‌, పృథ్వీరాజ్‌, ప్రియమణి తదితరులు నటిస్తున్నారు. జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu