»   » ఇన్ఫోసిస్ స్వాతి హత్య కేసు పై సినిమా: పోలీసులే గొంతుకోసినట్టు, వివాదం కానుందా?? (ఫొటోలు)

ఇన్ఫోసిస్ స్వాతి హత్య కేసు పై సినిమా: పోలీసులే గొంతుకోసినట్టు, వివాదం కానుందా?? (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల చెన్నై నగరం లో సంచలనం కలిగిం చిన ఇన్ఫోసిస్‌ ఉద్వోగిని స్వాతి హత్యాఉదంతం సినిమాగా తెరకెక్కుతోంది. నగరంలోని నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో పట్టపగలు జరిగిన టెకీ స్వాతి హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఉదంతం నేపథ్యంతో ఓ చిత్రం రూపొందింది. 'స్వాతి కొలై వజక్కు' (స్వాతి హత్య కేసు) పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని జయశ్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎస్‌.కె.సుబ్బయ్య నిర్మించగా రమేష్‌ సెల్వన్‌ దర్శకత్వం వహించారు.

స్వాతి హత్యకేసు

స్వాతి హత్యకేసు

రమేష్‌ సెల్వన్‌ దర్శకత్వంలో విజయ్‌కాంత్‘ఉళవుతురై', అరుణ్‌ విజయ్‌ ‘జననం', ‘వజ్రం' చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ‘స్వాతి కొలై వళక్కు' చిత్రంలో టెకీ స్వాతి పాత్రలో ఆయిరా నటించారు. స్వాతి హత్యకేసు నిందితుడు రామ్ కుమార్‌ పాత్రలో మనో అనే కొత్త నటుడు, న్యాయవాది రాంరాజ్‌ పాత్రలో వెంకటేష్‌, స్వాతి హత్యకేసు విచారించిన నుంగంబాక్కం పోలీస్‌ ఇన్‌స్పెక్టరు పాత్రలో అజ్మల్‌ శంకర్‌లు నటించారు.

యథాతథంగా

యథాతథంగా

యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించే చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొన్ని కల్పిత ఘటనలు అదనంగా చేర్చడం మామూలే. అయితే ‘స్వాతి కొలై వళక్కు'లో అలాంటి సన్నివేశాల్ని చేర్చలేదని, జరిగిన సంఘటలను యథాతథంగా పునర్నిర్మించామని, ఈ హత్యకేసులో ప్రజలకు తెలియని పలు విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయని దర్శకుడు రమేష్‌ తెలిపారు.

రామ్ కుమార్‌ గొంతును పోలీసులు కోసినట్లుగా

రామ్ కుమార్‌ గొంతును పోలీసులు కోసినట్లుగా

ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం చెన్నై వడపళనిలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. నిందితుడు రాంకుమార్‌ను పట్టుకునే సమయంలో అతడు గొంతు కోసుకున్నట్లు పోలీసులు చెబుతుండగా పోలీసులే అతని గొంతు కోసినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఈ చిత్రం ట్రైలర్‌లో రామ్ కుమార్‌ గొంతును పోలీసులు కోసినట్లుగా చూపడం గమనార్హం.

దేశం మొత్తాన్నీ

దేశం మొత్తాన్నీ

రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగినిను అందరూ చూస్తుండగానే ఓ ఆగంతకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. హతురాలు చూలైమేడు ప్రాంతానికి చెందిన స్వాతి గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు తమిళనాడు వరకే కాదు దేశం మొత్తాన్నీ ఒక ఊపు ఊపింది. ఈ కేసులో ఇప్పటికీ మిస్టరీగానే కనిపించే అంశాలెన్నో ఉన్నాయి.

ఉదయం 6.20 ప్రాంతంలో

ఉదయం 6.20 ప్రాంతంలో

ఇన్ఫోసిస్‌ కంపెనీలో పనిచేస్తున్న స్వాతి సూలైమేడు ప్రాంతంలోని దక్షిణ గంగై వీధిలో నివసించేది. ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం 6.20 ప్రాంతంలో ఆమె తండ్రి నుంగంబాకమ్‌ స్టేషన్‌‌ వద్ద దించి వెళ్లాడు. దీంతో ఆఫీసుకు వెళ్లేందుకు నుంగంబాకమ్‌ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తోంది.

కత్తితో పొడిచి

కత్తితో పొడిచి

ఇంతలో నల్ల ప్యాంటు వేసుకున్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి, ఓ కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. స్వాతి ముఖం మీద, మెడ మీద తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించింది. ఆవెంటనే దాడి చేసిన యువకుడు కూడా అక్కడినుంచి పారిపోయాడు.

నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య

అయితే ముందు ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుందని, ఆ తర్వాత అతడు బ్యాగ్‌లోంచి కత్తిని బయటకు తీసి దాంతో ఆమెను పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడినుంచీ పోలీసులు రంగం లోకి దిగారి. అనేక మలుపులు తిరిగిన స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవటం తో ముగిసింది.

English summary
The trailer of ‘Swathi Kolai Vazhakku,’ a film based on murder of Swathi, the 24-year-old software engineer, and the real life incidents surrounding the subsequent investigation was released by the makers on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu