»   » ఆ హీరోతో రొమాన్స్ కోసం ఎదురు చూస్తున్నా...?

ఆ హీరోతో రొమాన్స్ కోసం ఎదురు చూస్తున్నా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు, తమిళ భాషల్లో నాయికగా బిజీగా వుంది మిల్క్ బ్యూటీ తమన్నా. తెలుగులో ప్రస్తుతం రామ్‌చరణ్‌తో 'రచ్చ", జూ.ఎన్టీఆర్‌తో (ఊసరవెల్లి ఇంకా ఖరారు కాలేదు), రామ్‌ తో 'ఎందుకంటే ప్రేమంట" చిత్రాలతో బిజీగా వున్న తమన్నా తనకు విక్రమ్‌తో నటించాలనే కోరిక వుందంటోంది. తమిళ చిత్ర పరిక్షిశమలోని క్రేజీ కథానాయకులైన ధనుష్ , విజయ్, కార్తీ, సూర్య, 'జయం"రవిలతో ఆన్‌ స్ర్కీన్ రొమాన్స్ చేసిన తమన్నా ఇప్పటికీ విక్రమ్‌ తో రొమాన్స్ చేసే అవకాశం రాలేదని బాధపడుతోంది.

ఆయనతో నటించే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని , పైగా ఆయన నటించిన 'దైవతిరుమగల్" చూశానని, అందులో ఆయన నటన ఎంతగానో ఆకట్టుకుందని, ఇక రానున్న రోజుల్లో విక్రమ్‌తో నటించే ఛాన్స్ రావాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నానంటోంది. విక్రమ్‌తో నటించాలని ఆశగా ఎదురు చూస్తున్న తమన్నా కోరికని ఏ దర్శకుడు తీరుస్తాడో లేక తమన్నా స్టేట్‌మెంట్ విని విక్రమే తనతో రొమాన్స్ చేసే అవకాశం కల్పిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

English summary
Vikram has once again proved he is a versatile actor in Deiva Thirumagal. The stars histrionics has won him rave reviews and naturally several actresses in Kollywood are vying to share the screen space with him.One such actress is Tamanna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu