»   » కమల్ కోసం 60 లక్షలు త్యాగం చేసిన తమన్నా!

కమల్ కోసం 60 లక్షలు త్యాగం చేసిన తమన్నా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాలబుగ్గల సుందరి తమన్నా తెలుగు సినిమాలు లేవని బాధపడుతున్న విషయం తెలిసిందే..అయితే ఈ మధ్య అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం సంపాదించిన విషయం తెలిసిందే.. అది కాక మరో మంచి హీరో సరసన చేయడానికి ఓప్పుకుని కూడా ఆ చిత్రాన్ని, ఆ చిత్రం ద్వారా వచ్చే 60 లక్షల రూపాయలను కాదనుకుంది..దేనికోసమో తెలుసా? కమల్ హాసన్ కోసం..అవునండీ కమల్ హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం అని ఇప్పటికే పేరు పొందిన 'మర్మయోగి" చిత్రంలో హీరోయిన్ గా తమన్నా ఎంపికైంది, ఈ చిత్రం కోసం తెలుగు చిత్రాన్ని వదులుకుంది. తమన్నా ఇప్పటికే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్ ల పేరు వినబడిన విషయం తెలిసిందే. అయితే వారందరినీ కాదని కమల్ తమన్నాకు అవకాశం ఇచ్చాడట.

కమల్ సరసన చిత్రం అనగానే అన్నింటిని వదిలిపెట్టి అతని సరసన చేయడానికి రెడీ అయ్యింది. తమన్నా నిజంగా ఆ సినిమా వస్తుందో రాదో తెలియదు కానీ..ఒక వేళ వచ్చినా చివరి నిమిషం వరకు నీవే హీరోయిన్ అనేది గ్యారంటీగా లేని చిత్రం కోసం టాలీవుడ్ లో మంచి చిత్రాన్ని ప్లస్ 60 లక్షల ను పోగొట్టుకోవడం కరెక్టేనా ఆలోచించు తమ్..అంటున్నారు విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu