»   » ఒకప్రక్క యంగ్ హీరోలతో కమిట్ మెంట్స్...మరో ప్రక్క సూపర్ స్టారోతో...

ఒకప్రక్క యంగ్ హీరోలతో కమిట్ మెంట్స్...మరో ప్రక్క సూపర్ స్టారోతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లలో బిజీ స్టార్ గా వున్న తమన్నా, తాజాగా ఓ లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. అదేమిటంటే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం! కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న 'రాణా' చిత్రంలో ఓ కథానాయికగా తమన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే టబు, దీపికా పదుకొనేలను మిగతా పాత్రలకు సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూడో పాత్రకు పలువుర్ని పరిశీలించిన పిదప దర్శక నిర్మాతలు తమన్నాకే మొగ్గుచూపారట. ఇదిలా ఉంచితే, తమన్నా తెలుగులో నటించిన '100% లవ్' సినిమా ఈరోజు రిలీజ్ అవుతుండగా, 'బద్రీనాథ్' షూటింగ్ పూర్తయింది. యన్టీఆర్ తో 'ఊసరవెల్లి', రామ్ తో 'మన లవ్ స్టోరీ' ఇప్పటికే కమిట్ కాగా, రామ్ చరణ్ తో 'రచ్చ' సినిమాలో కూడా తమన్నానే నటించనుందని అంటున్నారు.

English summary
Tamanna, who is ruling as Top Actress in Tamil has strong desire to pair up with Super star Rajinikanth. She is adamant to pair with Hero in his RANA project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu