»   » కార్తీ వ్యవహారంఫై మీడియాకు చెప్పవలసిన అవసరం లేదు..!?

కార్తీ వ్యవహారంఫై మీడియాకు చెప్పవలసిన అవసరం లేదు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ఇటీవల ఒక తమిళ చిత్రం ప్రెస్ మీట్ లో తమిళ హీరో కార్తీకి తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్న సంగతి గురించి మీడియా అడగగా, అసలు కార్తీ గురించి తనకేమీ తెలియదని, అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఏమీ లేదని, పదే పదే ఆ విషయం ప్రస్తావించవద్దని చెప్పింది.

అయినా మీడియా వాళ్ళు పదే పదే ఆ విషయమే అడిగేసరికి విసుగుచెందిన తమన్నాఇటువంటి విషయాలకు తన తల్లిదండ్రులకు తప్ప ఇంకెవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా చెప్పి మీడియా నోరు మూయించింది. అసలు తను అటువంటి రూమర్స్ ను పెద్దగా పట్టించుకోనని, తన కెరీర్ లో తాను చేరుకోవాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని, అయినా తన జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి తన తల్లిదండ్రులకు మాత్రమే ఉండాలని తమన్నా తేల్చి చెప్పింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో అల్లు అర్జున్ తో బద్రీనాథ్ చిత్రంలో మరియు సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సరసన నటిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu