»   » మాజీ స్టార్ హీరోయిన్ ఆస్తులు వేలం

మాజీ స్టార్ హీరోయిన్ ఆస్తులు వేలం

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నారీ నారీ నడుమ మురారి', 'ఘర్షణ', 'కొబ్బరిబొండాం', 'మధురానగరిలో' వంటి హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన నిరోషా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా ఆర్ధికంగా బాగా చితికిపోయింది. దాంతో ఆమె ఆస్తిని చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బేక్ పబ్లిక్ వేలానికి పెట్టింది. ఆమె కెరీర్ బాగానే ఉన్నప్పుడు తమిళ హీరో రాకీ ('సింధూర పువ్వు') ని పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే ఆ తర్వాత రాకీ కెరీర్ ముందుకువెళ్ళకపోవటంతో కొంతకాలంగా బిజినెస్ ని,టీవీ సీరియల్స్ లో నటనను చేస్తూ వచ్చాడు. అయితే ఎన్నాళ్లు ఇలా అనుకుని ఓ పెద్ద హీరోను డైరక్ట్ చేయాలని నిర్ణయించుకుని నిర్మాతగా మారారు. అయితే సినిమా ముందుకు వెళ్ళలేదు కానీ వెనక ఆస్ధులు తరిగి వెక్కిరించాయి. నిరోష అక్క సీనియర్ నటి రాదిక కూడ చెల్లికేమీ సాయం చేయటం లేదు. ఈ పరిస్ధితుల్లో వాళ్ళు ఎప్పుడో వ్యాపారం కోసం తీసుకున్న లోన్ వడ్డీతో సహా పెరిగి వేలం వేసే స్ధితికి వచ్చింది. ఈ పబ్లిక్ వేలం ఆమె రుణం తీసుకున్న బ్రాంచ్ లోనే మార్చి పదవ తేదీన జరగనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu