»   » నిత్యానందుడి రాసలీలల హీరోయిన్ ఆమేనని కన్ఫర్మ్

నిత్యానందుడి రాసలీలల హీరోయిన్ ఆమేనని కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిత్యానంద స్వామితో సరస సల్లాపాలు సాగిస్తూ మీడియాకు దొరికిపోయాన తమిళ నటీమణి పేరు రంజిత. ఈ విషయాన్ని తమిల పత్రిక 'నక్కీరన్' పత్రిక తమ కధనంలో పేర్కొంది. ఈ మేరక ఆ పత్రిక సంచలనాత్మక ఫొటోలను ప్రచురించింది. రంజిత తెలుగులో అర్జున్ సరసన కర్ణ, జైహింద్‌లతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇక నిన్న(బుధవారం) ఆ నటీమణి పేరు...ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందంటూ సన్ టీవీలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో చాలా పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇక నిత్యానందకు సినీ పరిశ్రమలో పలువురు శిష్యులున్నట్లు సమాచారం. అక్కాచెల్లెళ్లైన సీనియర్ నటీమణులు ఆయనకు ప్రధాన శిష్యురాళ్లని తెలిసింది. చెల్లెలి కుమార్తె ఇటీవలే తెరంగేట్రం చేసింది. సీనియర్ నటి పలువురు నటీనటుల్ని నిత్యానందకు పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్వామి ఆశ్రమాలపై అంతటా దాడులు జరుగుతూండటంతో ఆయన హరిద్వార్‌లోని తన ఆశ్రమానికి వెళ్లిపోయారని చెప్తున్నారు. అయితే మరికొందరు ఆయన విదేశాలకే వెళ్ళి ఉంటాడనే సందేహాలు వెళ్ళబుచ్చుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X