»   » సొంత కూతురు కిడ్నాప్ కేసులో హీరోయిన్, తెలుగు నటి మంజుల కూతురే

సొంత కూతురు కిడ్నాప్ కేసులో హీరోయిన్, తెలుగు నటి మంజుల కూతురే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనటి వనిత ఇంటిగొడవ మరోసారి రచ్చకెక్కింది. తన కూతురిని తానే కిడ్నాప్ చేసిందంటూ ఆమె రెండో భర్త ఆనంద్ రాజ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, ఈ వార్త కోలీవుడ్ మొత్తం చర్చనీయాంశం కావటం తో వనిత కూడా మీడియా ముందుకు రాక తప్పలేదు. అసలు మొదటి నుంచీ వనిత జీవితం వివాదాల మయమే. ఒకరకంగా తెలుగు హీరోయిన్లు గా కొన్నాళ్ళు కనిపించిన ప్రీతీ (రుక్మిణి సినిమా హీరోయిన్) శ్రీదేవి లకు ఈ వనిత చెల్లెలు.

కూతురునే కిడ్నాప్ చేసిందన్న ఆరోపణ

కూతురునే కిడ్నాప్ చేసిందన్న ఆరోపణ

తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్, తెలుగులో కూడా హీరోయిన్ గానూ, క్యారెక్టర్ పాత్రల ద్వారానూ పరిచయం అయిన నటి మంజుల ల కూతురే ఈ వనిత. బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన వనిత ఇప్పటికి మూడు వివాహాలు చేసుకున్నా...పాపం ఎవ్వరి తోనూ ఆనందకరమైన జీవితాన్ని మాత్రం పొందలేక పోయింది... ఇప్పుడు సొంత కూతురునే కిడ్నాప్ చేసిందన్న ఆరోపణ తనను మరింత కుంగ దీసిందంటూ మీడియా ముందు వాపోయిందీమె... ఇంతకీ ఈ వివాదం సంగతేమిటి అంటే....

పద్దెనిమిది ఏళ్లకే ఆకాష్‌తో వివాహం

పద్దెనిమిది ఏళ్లకే ఆకాష్‌తో వివాహం

సినీ నటుడు విజయ్‌కుమార్‌ రెండో భార్య అయిన మంజుల పెద్ద కూతురు వనిత. ఈమెను చిన్నతనంలోని ఇండస్ట్రీకి పరిచయం చేశారు తల్లిదండ్రులు. పద్దెనిమిది ఏళ్లకే ఆకాష్‌తో వివాహం చేశారు. శ్రీహరి పుట్టిన తర్వాత వారిద్దరికి బెడిసి కొట్టింది. ఆ తర్వాత వనిత ఆనంద్‌రాజ్‌ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

చైన్నై కోర్టు

చైన్నై కోర్టు

తర్వాత వనిత తన కొడుకు శ్రీహరిని తనతోనే ఉంచాలని కోర్టును ఆశ్రయించింది. చైన్నై కోర్టు శ్రీహరిని తల్లి వనితతోనే ఉంచాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు తల్లికి అనుకూలంగా ఉంటే శ్రీహరి మాత్రం తల్లితో ఉండడానికి ఇష్టపడటం లేదు. తల్లి వద్ద ఉండేందుకు శ్రీహరిని ఒప్పించే పనిని కోర్టు ఆకాష్‌కు అప్పగించింది.

కుటుంబ గొడవలు

కుటుంబ గొడవలు

ఏదో బిజినెస్ టూర్‌కు వెళుతూ ఆకాష్‌ తన కొడుకు శ్రీహరిని విజయ్‌కుమార్‌కు అప్పగించారు. శ్రీహరిని తీసుకొని విజయ్‌కుమార్ చెన్నై ఎయిర్ పోర్టుకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వనిత అక్కడికి చేరడంతో కుటుంబ గొడవలు బయటపడ్డాయి. ఇక అక్కడ మొదలైన వివాదాలు వరుసగా వనితని వెంటాడుతూనే ఉన్నాయి.

సీనియర్‌ నటుడు విజయకుమార్, మంజుల

సీనియర్‌ నటుడు విజయకుమార్, మంజుల

చంద్రలేఖ, మాణిక్యం చిత్రాల్లో నాయకిగా నటించిన నటి వనిత తల్లిదండ్రులు సీనియర్‌ నటుడు విజయకుమార్, మంజుల. బుల్లితెర నటుడు ఆకాశ్‌ను ప్రేమించి పెళ్లాడిన వనిత కొంత కాలం తర్వాత ఆయన నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. సినిమాలతో సంబందం లేని వ్యక్తి అయితే సమస్యలు రావన్న అభిప్రాయం తో ఈ సారి వేరే రంగానికి చెందిన వ్యక్తికి దగ్గరయిన వనిత .

మూడో పెళ్లి

మూడో పెళ్లి

తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనందరాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి జయనిత అనే 8 ఏళ్ల కూతురు ఉంది. కాగా మసస్పర్ధల కారణంగా వనిత, ఆనంద్‌రాజ్‌లు విడిపోయారు. కూతురు తండ్రి వద్దే పెరుగుతోంది. నటి అల్ఫాన్స్‌ సోదరుడు, డాన్స్‌మాస్టర్‌ అయిన రాబర్ట్‌ను వనిత మూడో పెళ్లి చేసుకుంది. ఇటీవల వీరిద్దరూ కూడా విడిపోయినట్లు సమాచారం.

తన కూతుర్ని కిడ్నాప్‌ చేసిందంటూ

తన కూతుర్ని కిడ్నాప్‌ చేసిందంటూ

తాజాగా వనితపై రెండో మాజీ భర్త ఆనంద్‌రాజ్‌ తన కూతుర్ని కిడ్నాప్‌ చేసిందంటూ హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హైదరాబాద్‌ పోలీసులు వనితను విచారించడానికి చెన్నైకి చేరుకున్నారు. అయితే వనిత కోవైలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కూతురి కిడ్నాప్‌పై స్పందించిన నటి వనిత స్పందిస్తూ.... ఆనంద్‌రాజ్‌ నుంచి విడాకులు పొందాక అతని అడ్రస్‌ కూడా తనకు తెలియదని, తనే కూతుర్ని తీసుకెళ్లాడని తెలిపింది.

ఈమెయిల్‌ ద్వారా

ఈమెయిల్‌ ద్వారా

అనంతరం తాను ఈమెయిల్‌ ద్వారా కూతురు గురించి తెలుసుకున్నానని చెబుతూ... ఆనంద్‌రాజ్‌ కూతురికి తన గురించి లేనిపోనివి నూరి పోశాడని ఆరోపించింది. అయితే ఈ మెయిల్‌ ద్వారా తన ఫోన్‌ నెంబర్‌ తెలుసుకున్న జయనిత తండ్రి దగ్గర నుంచి తనను తీసుకెళ్లమని అభ్యర్ధించిందని పేర్కొంది.

కిడ్నాప్‌ ఎలా అవుతుంది

కిడ్నాప్‌ ఎలా అవుతుంది

దీంతో తాను హైదరాబాద్‌ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారితోపాటు ఆనంద్‌రాజ్‌ ఇంటికి వెళ్లి కూతురిని తీసుకొచ్చానని ఇది కిడ్నాప్‌ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను వేరే ప్రాంతంలో ఉన్నానని, తన కూతురు కోసం అరెస్ట్‌ అవడానికి ఎప్పుడూ తాను సిద్ధమేనన్నారు. అయితే దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని వనిత తెలిపారు.

English summary
Actress Vanitha Vijayakumar landed in controversy once again when she tried to kidnap her own daugther from her husband's home.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu