ఆయన థియేటర్లన్నీ ఆక్రమించారు, నా జీవితం నాశనం.. కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా మంది హాస్య నటులు హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అలా హీరోలుగా మారి సక్సెస్ సాధించిన కమెడియన్లు కొంత మంది ఉన్నారు. తాజాగా తమిళ హీరో వివేక్ ప్రధాన పాత్రలో నటించిన వెళ్ళై పుక్కళ్ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధం అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వివేక్ మాజీ పోలీస్ అధికారిగా నటించారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివేక్ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అదే సమయంలో కమల్ హాసన్ పై వివేక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

మర్డర్ మిస్టరీ

మర్డర్ మిస్టరీ

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ ఇళంగోవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేస్తున్న దర్శక నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు హాలీవుడ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి అనేక అవార్డులు అందుకున్నారు. వీరంతా కలసి తొలిసారి రూపొందిస్తున్న వెండితెర చిత్రం వెళ్ళై పుక్కళ్.

మాజీ పోలీస్ అధికారి

మాజీ పోలీస్ అధికారి

ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. మాజీ పోలీస్ అధికారి అయిన వివేక్ రిటైర్ అయిన తర్వాత అమెరికాకు వెళతాడు. అక్కడ ఉన్న తన కొడుకు కోడలితో మిగిలిన జీవితాన్ని గడపాలని భావిస్తాడు. చుట్టుపక్కల ఉన్నవారు కొందరు అతడికి స్నేహితులుగా మారుతారు. కొన్ని రోజుల తర్వాత తన స్నేహితులలో కొందరు మరణిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథని దర్శకుడు ఉత్కంఠ భరితంగా రూపొందించారు.

హీరోగా సక్సెస్ కాలేకపోయా

హీరోగా సక్సెస్ కాలేకపోయా

వివేక్ మాట్లాడుతూ దశాబ్దాలుగా హాస్య నటుడిగా కొనసాగుతూ కొన్ని వందల చిత్రాల్లో నటించానని తెలిపారు. తాను స్టార్ హీరోలతో నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. కానీ తాను హీరోగా నటించిన చిత్రాలు మాత్రం రాణించలేదని వివేక్ తెలిపారు. తాను హీరోగా నటించిన చిత్రాలలో నాన్ థాన్ బాల చిత్రం బెస్ట్ మూవీ అని వివేక్ తెలిపాడు. కానీ ఆ చిత్ర విడుదల సమయంలోనే కమల్ హాసన్ పాపనాశనం చిత్రం కూడా విడుదలై థియేటర్లు మొత్తం ఆక్రమించింది. దాని వలన నేను చాలా నష్టపోయా. ఒకరకంగా కమల్ హాసన్ తన జీవితాన్ని నాశనం చేశారని వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదృష్టం ఎలా ఉందో

అదృష్టం ఎలా ఉందో

వివేక్ తాజాగా హీరోగా నటిస్తున్న వెళ్ళై పుక్కళ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ సారి అతడి అదృష్టం ఎలా ఉందో అనే చర్చ జరుగుతోంది. సింగం సిరీస్, అపరిచితుడు, శివాజీ లాంటి అద్భుత చిత్రాలతో వివేక్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X