»   » తీవ్ర గాయాలుతో తమిళ హీరో శరత్‌ కుమార్‌

తీవ్ర గాయాలుతో తమిళ హీరో శరత్‌ కుమార్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ ఓ కన్నడ చిత్రం షూటింగ్‌లో నటుడు శరత్‌కుమార్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. సారథి అనే కన్నడ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న శరత్ కుమార్ పై కొన్ని రోజుల నుంచి పుదుచ్చేరిలో పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఆ క్రమంలో శరత్‌కుమార్‌ పై గుర్రపుస్వారీ చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తూంటే...గుర్రం తన ముందు కాళ్లు ఒక్కసారిగా పైకెత్తడంతో శరత్‌కుమార్‌ గుర్రాన్ని అదుపుచేయలేక కింద పడిపోయారు. దిగ్భ్రాంతి చెందిన చిత్ర యూనిట్‌ వెంటనే తేరుకుని శరత్‌కుమార్‌ను సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వీపు భాగంలో ఎముక విరిగినట్లు మూడు వారాల పాటు ఆయనకు చికిత్స అవసరం అని వైద్యులు తెలిపారు. దీంతో షూటింగ్‌ రద్దయింది. అనంతరం చెన్నైకి తిరిగి వచ్చిన శరత్‌కుమార్‌ ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. ఇక గుర్రం మీద వేగంగా స్వారీ చేసే సన్నివేశాన్ని శరత్‌కుమార్‌ ముందుగా రిహార్సల్స్‌ చేశారనీ అయితే అనుకోకుండా ఈ ప్రమాదం చోటు చేసుకుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. కన్నడ నటుడు దర్శన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దినకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరత్ ‌కుమార్‌ బాగానే ఉన్నారని ఆయన పూర్తిగా కోలుకోవటానికి టైమ్ పడుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరత్ కుమార్ గతంలో స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్ వంటి కొన్ని తెలుగు చిత్రాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేసారు. అలాగే ఆయన హీరోగా చేసిన తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu