అంతా దేవుడి చేతిలోనే.. వనితా విజయ్ కుమార్‌తో పెళ్లిపై స్పందించిన తమిళ పవర్ స్టార్!
తమిళ చిత్రం పికప్ అండ్ డ్రాప్ సినిమా కోసం బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్ కుమార్, తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో చేసిన పెళ్లి షూట్ దక్షిణాదిలో సంచలనం రేపింది. వనితా విజయ్ కుమార్ పెళ్లి ఫోటోను ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే పెళ్లి ఫోటో గురించి పికప్ అండ్ డ్రాప్ సినిమా ప్రెస్ మీట్‌లో తమిళ పవర్ స్టార్ మాట్లాడుతూ...
Recommended Video

తమిళ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా
తమిళ చిత్ర పరిశ్రమలో శ్రీనివాసన్ అనే కమెడియన్ కమ్ హీరోను పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకొంటారు. ఆయన నటించిన చిత్రాలు తమిళ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించడంతో ఆయనకు ఆ పేరు సార్థకం అయింది. ఆయన నటించిన అనల్‌కాట్రు, అందగన్, 2కే బ్యూటీఫుల్ లవ్, రెడ్ మెన్, వాసుస్ ప్రెగ్నెంట్, కొడురన్ చిత్రాలు మంచి ప్రేక్షకాదరణను సాధించి పెట్టాయి.

పవర్ స్టార్ నటించిన చిత్రం 350 రోజులు
నేను నటించిన గత చిత్రం లతికా తమిళనాడులో 350 రోజులు ఆడింది. పికప్ అండ్ డ్రాప్ చిత్రం కూడా 300 రోజులు ఆడుతుందనే నమ్మకం మాకు ఉంది. ప్రేక్షకులు, అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల దీవెనలు ఉంటే పికప్ అండ్ డ్రాప్ ఘన విజయం సాధిస్తుంది అని పవర్ స్టార్ శ్రీనివాసన్ అన్నారు. నేను ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తున్నాను అని తెలిపారు.

వనితా విజయ్ కుమార్‌తో పెళ్లి అని
ఇదిలా ఉండగా, వనితా విజయ్ కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి చేసుకోనే వ్యక్తి పేరు S అనే ప్రచారం జరిగింది. ఆ క్రమంలో శ్రీనివాసన్‌తో వనితా విజయ్ కుమార్ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వనితా విజయ్ కుమార్‌ను పెళ్లి చూసుకొంటున్నారా అంటూ మీడియా ప్రశ్నించడంతో శ్రీనివాసన్ నవ్వుతూ సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించారు

పెళ్లి అనేది దేవుడి చేతిలోనే..
వనిత విజయ్ కుమార్ పెళ్లి గురించి శ్రీనివాసన్ స్పందిస్తూ.. పెళ్లి అనేది ఎవరి చేతుల్లో ఉండదు. నా పెళ్లి గానీ, వనితా విజయ్ కుమార్ గానీ ఎవరి చేతుల్లో ఉండదు. కేవలం భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది. తల రాత, పెళ్లి రాత మన చేతుల్లో ఉండదు అంటూ అని శ్రీనివాసన్ అన్నారు.

రాజకీయాల్లో తమిళ పవర్ స్టార్
ఇక పవర్ స్టార్ శ్రీనివాసన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. కేవలం సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంపై కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 2016లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం బీజేపీకి గుడ్‌బై చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి 2019లో లోక్‌సభకు పోటీచేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మాయమ్ పార్టీ తరఫున దక్షిణ చెన్నై స్థానంలో పోటీ చేసి డీఎంకే అభ్యర్తి చేతిలో 1 లక్ష 73 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


Click it and Unblock the Notifications











