»   » ఛీటింగ్ కేసులో సినీ నిర్మాత అరెస్టు

ఛీటింగ్ కేసులో సినీ నిర్మాత అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: భాగస్వామ్యం ఆశ చూపించి రూ.48 లక్షల మేరకు మోసం చేసిన కేసులో సినీ నిర్మాతను నగర పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట్త్టె జిల్లా కె.పుదుపట్టి గ్రామానికి చెందిన సెంథిల్‌బాబు (31) ఇటీవల చెన్నై నెర్కుండ్రానికి చెందిన సినీ నిర్మాత గణేశన్‌పై నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Tamil Producer Arrested in Cheating Case!

'విసయం వెళియ తెరియకూడాదు నాసుక్కా చెయ్యనుం' అనే సినిమాను ప్రముఖ దర్శకుడు, మరికొంత మంది సహకారంతో నిర్మిస్తుండగా ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయిందని, పెట్టుబడి పెడితే లాభాల్లో 47 శాతం ఇస్తానని గణేశన్‌ తనను నమ్మించాడని తెలిపారు.

దీంతో రూ.48 లక్షలు ఇవ్వగా... సినిమా విడుదలైన తర్వాత తిరిగి చెల్లించకపోవడంతోపాటు లాభం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనరు రాజేంద్రన్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం గణేశన్‌ను మంగళవారం అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పుళల్‌ జైలుకు తరలించారు.

English summary
A Tamil producer who borrowed Rs 48 Lakhs saying that he is making a movie and will return the money with interest got arrested in Chennai last night.
Please Wait while comments are loading...